మేడ్చల్ దోపిడీ దొంగల హల్చల్...గాల్లోకి కాల్పులు జరుపుతూ జువెల్లరీ షాప్ చోరీ (వీడియో)

https://static.asianetnews.com/images/authors/3800b66b-dc46-549b-a35e-91a1dbfb7895.jpg
First Published 18, Sep 2018, 8:31 PM IST
Gold Robbery In Medchal District
Highlights

మేడ్చల్ జిల్లా కీసర మండలంలో పట్టపగలే దోపిడి దొంగలు రెచ్చిపోయారు. ఓ జువెల్లరి షాప్ లోకి తుపాకితో ప్రవేశించిన దొంగలు యజమానికి, సిబ్బందిని బెదిరించి బంగారాన్ని, నగదును దోచుకున్నారు. వారిని భయపెట్టడానికి గాల్లోకి కాల్పులు జరుపుతూ భయానక వాతావరణాన్ని సృష్టించారు. 

కీసర దుమ్మాయిగూడలోని దుబాయ్ బిల్డింగ్ వద్ద గల ఆర్.ఎస్ రాథోర్ జువెల్లరీ షాప్ లోకి ఆరుగురు ఆగంతకులు మారణాయుధాలతో ప్రవేశించారు. షాప్ లోని సిబ్బందితో పాటు యజమానిని తుపాకీతో బెదిరించి చోరీకి పాల్పడ్డారు. అంతే కాదు జువెల్లరీ షాప్ లోంచి బయటకు వచ్చాక కూడా తుపాకీతో గాల్లోకి కాల్పులు జరుపుతూ అక్కడున్నవారిని బెదిరించారు. రోడ్డుపై వెళుతున్న బైకర్లను బెదిరించి వాహనాన్ని లాక్కుని పరారయ్యారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న రాజకొండ కమీషనర్ మహేష్ భగవత్ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం ను రప్పించి ఆధారాల కోసం వెతుకుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు కమీషనర్ తెలిపారు. త్వరలోనే ఈ దోపిడీ దొంగలను పట్టుకుంటామని ఆయన తెలిపారు.

వీడియో

"

loader