కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్నసాగర్ ప్రాజెక్టులోకి గోదావరి నీరు చేరింది. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు ఆసక్తికర కామెంట్స్ చేశారు. 

సిద్దిపేట: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ కు గోదావరి నీరు చేరింది. ట్రయల్ రన్ సందర్భంగా రిజర్వాయర్ లోకి స్వల్పంగా నీటిని వదిలి పరిశీలించారు అధికారులు. అనేక వివాదాలు, మరెన్నో ఆటంకాల మధ్య పూర్తయిన మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ లోకి గోదావరి నీరు వదిలిన సందర్భంగా మంత్రి హరీష్ రావు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

''కేసీఆర్ స్వప్న సాక్షాత్కారం, తెలంగాణకు అమృత జలాభిషేకం. సాకారమైన మల్లన్న సాగరం. అనుమానాలు అపశకునాలు అవరోధాలు తలవంచి తప్పుకున్నయి. కుట్రలు కుహనా కేసులు వందల విమర్శలు వరద నీటిలో కొట్టుక పొయినయి. గోదారి గంగమ్మ మల్లన్న సాగరాన్ని ముద్దాడింది. కరువును శాశ్వతంగా సాగనంపింది'' అంటూ హరీష్ రావు ట్వీట్ చేశారు. 

Scroll to load tweet…

''కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌ నీటితో కళకళలాడుతోంది. ఈ ప్రాజెక్టులోకి మొదటి విడతగా 10 టీఎంసీల గోదావరి జలాలు ఈరోజు విడుదలయ్యాయి. మరికొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయిలో ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది'' అని తెలిపారు. 

read more హుజురాబాద్: మంత్రి హరీష్, గెల్లు శ్రీనివాస్ కు రాఖీ కట్టిన మహిళలు Volume 90%

''తెలంగాణ రైతాంగం ఆనందంతో మురిసింది. ప్రజలమీద విశ్వాసంతో పట్టుదలతో పనిచేస్తే కానిదేది లేదని తెలంగాణ ప్రభుత్వం ప్రపంచానికి చాటింది'' అని హరీష్ రావు పేర్కొన్నారు.