రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మెయినాబాద్ లో ఓ మేకకు ఫైన్ విధించి సంచలనం నమోదు చేశారు అధికారులు. తాను ఏం చేశానో తెలియని మేకకు ఏకంగా రూ.500 జరిమానా విధించారు. 

ఇంతకీ ఆమేక ఏ తప్పు చేసిందని ఆ ఫైన్ విధించారనుకుంటున్నారా...? హరితహారంలో నాటిన చెట్లను తినడం. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా  నాటిన మేకకు రూ.500 జరిమానా విధించారు అధికారులు. 

మేకకు ఫైన్ వేయడంతో జరిమానా కట్టింది యజమానురాలు. ఫైన్ కడుతూ మేక ఎంత పనిచేశావే అంటూ కంటతడిపెట్టింది. అధికారులపై ఒకింత ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. మూగజీవికి ఏ మెుక్క తినాలో ఎలా తెలుస్తుందంటూ ప్రశ్నించింది. ఇంక అధికారులు తగ్గకపోవడంతో ఒంటరి మహిళలపైకక్షపూరితంగా వ్యవహరించారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక చేసింది లేక డబ్బులు కట్టి తన మేకను విడిపించుకుంది ఆ మహిళ. 

ఇకపోతే ఈ ఏడాది జూలై 22న సిద్ధిపేట మున్సిపాలిటీ  హైదరాబాద్ వెళ్లే రోడ్డులో కలెక్టర్ క్యాంప్ కార్యాలయం వద్ద జి. వీరేశం అనే వ్యక్తి హరితహారం చెట్టును నరికివేశాడు. చెట్టును నరికివేస్తున్న అతడిని మున్సిపాలిటీ సిబ్బంది పట్టుకున్నారు. రూ.1000 ఫైన్ వేసి మందలించి వదిలేశారు. 

మరోసారి ఇలా చెట్టును నరికితే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అంతేకాదు జైలుకు కూడా పంపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇకపై హరితహారంలో చెట్లును నరికితే ఇలాంటి పరిస్థితే ఎవరికైనా ఎదురవుతుందని కూడా హెచ్చరించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

చెట్టు నరికినందుకు వెయ్యి రూపాయలు ఫైన్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం