Asianet News TeluguAsianet News Telugu

ప్రియుడితో కలిసి... ప్రేమగా పెంచిన తల్లినే చంపిన కసాయి కూతురు

అనాధాశ్రమంలో బ్రతకాల్సిన తనను చేరదీసిన తల్లినే కనికరం లేకుండా ఓ కసాయి కూతురు హతమార్చింది. ఈ దారుణం హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

Girl kills mother with help of boyfriend in hyderabad
Author
Hyderabad, First Published Sep 12, 2021, 7:49 AM IST

హైదరాబాద్: కడుపున పుట్టిన సంతానం వున్నా అనాథ అమ్మాయిలను చేరదీసి వారి ఆలనాపాలనా కూడా చూసుకుంది ఆ  మాతృమూర్తి. ఇలా అల్లారుముద్దుగా చూసుకుంటున్న ఆ తల్లి ప్రేమను మరిచి ప్రియుడి మోజులో పడిపోయి దారుణానికి ఒడిగట్టింది ఆ కసాయి కూతురు. కానుల కోసం ఆ కసాయి కూతురు ప్రియుడి సాయంతో తల్లినే హతమార్చింది. ఈ దారుణం హైదరాబాద్ లో చోటుచేసుకుంది.  

వివరాల్లోకి వెళితే... ప్రాన్స్ కు చెందిన మేరీ క్రిస్టినా(68) దాదాపు 30ఏళ్ళ క్రితమే ఇద్దరు పిల్లలు సొలాంగ్, రెబెకాలతో కలిసి హైదరాబాద్ కు వచ్చేసింది. నగర శివారులోని గండిపేట్ మండలం దర్గాఖలీజ్ ఖాన్ ప్రాంతంలో ఓ ఇంటిని తీసుకుని ఇక్కడే స్థిరపడిపోయింది. పెద్ద కూతురు సోలంకిని ప్రశాంత్ అనే యువకుడికి ఇచ్చి పెళ్లిచేసింది. మరో కూతురు రెబెకా పుదుచ్చెరిలో వుంటోంది.  

ఇలా ఒంటరిగా వుంటున్న క్రిస్టినా క్రిస్టినా రోమా(24), ప్రియాంక అనే ఇద్దరు అనాధ అమ్మాయిలను తన ఇంట్లోనే వుంచుకుని వారి ఆలనాపాలనా చూసుకుంటోంది. అయితే రోమా తాడిపత్రికి చెందిన  విక్రమ్ శ్రీరాములు(25) అనే యువకుడిని ప్రేమించి తల్లికి తెలియకుండా అతడితో సహజీవనం చేస్తోంది. ఇలా ప్రియుడిమోజులో పడి పెంచిన తల్లికి దూరమైన రోమా ఇటీవల బిజినెస్ చేయడానికి డబ్బులు కావాలంటూ తల్లిని అడిగింది. అందుకు క్రిస్టినా అంగీకరించకపోవడంతో ఆమెను చంపి బ్యాంక్ ఖాతాలోని డబ్బులు కాజేయాలని భావించిన రోమా ప్రియుడితో కలిసి దారుణానికి ఒడిగట్టింది.

read more  మేడ్చల్‌: బైక్, టాటా ఏస్‌ల‌పైకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి

ముందస్తు ప్రణాళిక ప్రకారం క్రిస్టినా ఇంట్లోంచి పనిపై బయటకు వెళ్లగా రోమా ప్రియుడు విక్రమ్, అతడి స్నేహితుు రాహుల్ ఆమె ఇంటివద్ద కాపుకాశారు. తిరిగి కారులో ఇంటికి చేరుకోగా పార్కింగ్ స్థలంలోనే క్రిస్టినాపై ఒక్కసారిగా దాడిచేసి తాడుతో మెడకు ఉరిబిగించి చంపేశారు. ఆ తర్వాత శవాన్ని అదే కారులో హిమాయత్‌సాగర్‌ సమీప పొదల్లో పడేసి తిరిగి ఇంటికి చేరకుని క్రిస్టినా ల్యాప్ టాప్, సెల్ ఫోన్ తీసుకెళ్లారు. ఆ తర్వాతిరోజు క్రిస్టినా బ్యాంక్ ఖాతాలోంచి డబ్బులను రోమా తన ఖాతాలోకి బదిలీ చేసుకుని సెల్ ఫోన్ స్విచాప్ చేసింది.

అయితే క్రిస్టినా సెల్‌ఫోన్ పనిచేయకపోవడంతో పాటు అనుమానం వచ్చిన పెద్దకూతురు సొలాంగ్ ఇంటికెళ్లి చూడగా తల్లి కనిపించలేదు. ఆమె ఆచూకీ కోసం ఎంత ప్రయత్నించినా లాభం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రోమాపై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది. దీంతో రోమాతో పాటు హత్య చేసిన విక్రమ్‌, రాహుల్‌ని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.    
 

Follow Us:
Download App:
  • android
  • ios