టీవీ విషయంలో ఇద్దరు అక్కా చెల్లెళ్లు గొడవ పడ్డారు. ఈ కారణంతో  అవమానంతో అక్క ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... భాగ్యలక్ష్మీ కాలనీకి చెందిన ఇద్దరు కుమార్తెలు పెద్ద కుమార్తె(19) జనగాంలోని హాస్టల్ లో ఇంటర్మీడియట్ చదువుతోంది. ఇటీవల సంక్రాంతి పండగ సెలవులకు ఇంటికి వచ్చింది. ఆదివారం టీవీ చూసే విషయంలో చెల్లితో ఘర్షణ పడింది. దీంతో అవమానానికి గురైన సదరు యువతి ఇంట్లోకి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకకుంది.

Also Read కుటుంబ తగాదా... పోలీస్ స్టేషన్ లో బావ గొంతు కోసిన బావమరిది...

అదే సమయంలో బయటకు వెళ్లిన తండ్రి ఇంట్లోకి వచ్చి  చూడగా.. పెద్ద కూతురు ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించింది. వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా... అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.