Asianet News TeluguAsianet News Telugu

లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘనలు: ఎల్బీనగర్ డీ మార్ట్ సీజ్

కరోనా లాక్‌డౌన్ నిబంధనలను పాటించని ఎల్ బీ నగర్ డీ మార్ట్ ను జీహెచ్ఎంసీ విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు  మంగళవారం నాడు సీజ్ చేశారు. 
LB Nagar D-mart seizes for violating lockdown rules in Hyderabad
Author
Hyderabad, First Published Apr 15, 2020, 11:18 AM IST
హైదరాబాద్: కరోనా లాక్‌డౌన్ నిబంధనలను పాటించని ఎల్ బీ నగర్ డీ మార్ట్ ను జీహెచ్ఎంసీ విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు  మంగళవారం నాడు సీజ్ చేశారు. లాక్‌డౌన్ సమయంలో నిత్యావసర సరుకుల దుకాణాలకు ప్రభుత్వాలు అనుమతిని ఇచ్చాయి. అయితే ఈ విషయంలో కొన్ని నిబంధనలను పాటించాలని అధికారులు ఆదేశించిన విషయం తెలిసిందే.

లాక్ డౌన్ నిబంధనలకు విరుద్దంగా ఎల్బీనగర్ డీ మార్ట్‌లో వినియోగదారులు సామాజిక దూరం కూడ పాటించడం లేదని జీహెచ్ఎంసీ విజిలెన్స్ ఎన్‌పోర్స్ మెంట్ అధికారులు గుర్తించారు.  మంగళవారం నాడు ఎల్బీనగర్ డీ మార్ట్ ను అధికారులు తనిఖీ చేసిన సమయంలో నిబంధనలను ఉల్లంఘనను వారు గుర్తించారు.

వినియోగదారులు పెద్ద ఎత్తున మార్కెట్ లో ఉన్నారు. కనీసం సామాజిక దూరం పాటించడం లేదు. ఈ విషయమై డీ మార్ట్ లో ఉన్న సూపర్ వైజర్లు కానీ అక్కడ పనిచేసే వారు కనీసం పట్టించుకోని విషయాన్ని అధికారులు గుర్తించారు.దీంతో డీ మార్ట్ ను మంగళవారం నాడు అధికారులు సీజ్ చేశారు. 
also read:ఇల్లు దాటకున్నా హైద్రాబాద్‌లో ఇద్దరికి కరోనా

హైద్రాబాద్‌లో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. హైద్రాబాద్ లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాకుండా ప్రభుత్వం జాగ్రత్త చర్యలు తీసుకొంటుంది. జీహెచ్ఎంసీని జోన్లుగా విభజించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకొన్నారు.
 
Follow Us:
Download App:
  • android
  • ios