హైద్రాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 36 లో ఉన్న మకావ్ పబ్ ను బుధవారం నాడు జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. పైర్ సేఫ్టీ చర్యలు లేనందున చర్యలు  తీసుకొన్నారు.

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 36లో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న Makau Pub పబ్ ను జీహెచ్ఎంసీ అధికారులు బుధవారం నాడు సీజ్ చేశారు.ఈ పబ్ లో ఫైర్ సేఫ్టీ పాటించడం లేదని GHMC అధికారులు తెలిపారు. అంతేకాకుండా పబ్ కు ఎలాంటి అనుమతి కూడా తీసుకోలేదని కూడా జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. నగరంలో పలు పబ్ లపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇావాళ మకావ్ పబ్ పై జీహెచ్ఎంసీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ పబ్ లో Fire సేఫ్టీ చర్యలు లేవని అధికారులు గుర్తించారు. వెంటనే ఈ పబ్ ను మూసివేయాలని కూడా Notices ఇచ్చారు.

హైద్రాబాద్ నగరంలో పబ్ లపై పలు ఆరోపణలున్నాయి. పబ్ లలో డ్రగ్స్ తో పాటు గంజాయి వంటివి లభ్యం కావడం కలకలం రేపుుంది. ఈ నెల 3న పుడింగ్ మింక్ పబ్ లో పోలీసులు దాడి చేసిన సమయంలో కూడా డ్రగ్స్ లభ్యమయ్యాయి.ఈ పబ్ నిర్వహిస్తున్న అభిషేక్ ఉప్పలతో పాటు పబ్ మేనేజర్ అనిల్ కుమార్ లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ కేసు విషయమై లోతుగా దర్యాప్తు చేసేందుకు హైద్రాబాద్ పోలీసులు ఈ ఇద్దరిని కస్టడీలోకి తీసుకొని విచారించిన విషయం తెలిసిందే.