హైదరాబాద్: గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల బరిలో పోటీ చేస్తున్న వారిలో 49 మందికి నేర చరిత్ర ఉందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రకటించింది.

నేర చరిత్ర ఉన్నవారికి సీట్లు ఇవ్వకూడదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ రాజకీయ పార్టీలను కోరింది. అయితే ఈ వినతిని  పార్టీలు అంతగా పట్టించుకోలేదని అర్ధమౌతోంది.

రాషం్ట్ర ఎన్నికల సంఘం వెబ్ సైట్ నుండి తీసుకొని  విశ్లేషించామని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తెలిపింది.  ప్రస్తుతం పోటీలో ఉన్న వారిలో 49 మందిపై 96 కేసులు నమోదయ్యాయి.

also read:జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నేర చరితులకు సీట్లివ్వొద్దు: ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ డిమాండ్

గత ఎన్నికల్లో పలు రాజకీయపార్టీలు 72 మంది నేరచరిత్ర ఉన్నవారికి టికెట్లు ఇచ్చారు.ఈ దఫా గతంలో కంటే నేర చరిత్ర ఉన్న అభ్యర్ధులు ఈ దఫా తగ్గారు.ఈ ఎన్నికల్లో అభ్యర్ధుల గుణగణాలను పరిగణనలోకి తీసుకొని ఓటు చేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పధ్మనాభ రెడ్డి కోరారు.

ప్రస్తుతం పోటీలో ఉన్న వారిలో నేరచరిత్ర ఉన్న అభ్యర్ధులకు టీఆర్ఎస్ 13, బీజేపీ 17, కాంగ్రెస్ 12, మజ్లిస్ సీట్లు కేటాయించినట్టుగా  ఆయన చెప్పారు.ఈ ఎన్నికల్లో పోటీలో ఉన్న ఆరుగురు మహిళా అభ్యర్ధులపై కూడా కేసులున్నాయి. గత ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో 8 మందిపై కేసులున్న విషయం తెలిసిందే.

మల్కాజిగిరి నియోజకవర్గంలోని 140 వార్డులో పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్ధులందరికీ నేర చరిత్ర ఉందని పధ్మనాభరెడ్డి చెప్పారు.

కేపీహెచ్‌బీ కాలనీలోని 114 వార్డు నుండి బీజేపీ తరపున పోటీ చేస్తున్న ప్రీతం కుమార్ రెడ్డిపై అత్యధికంగా 9 కేసులున్నట్టుగా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తెలిపింది. షాలిబండ 48 వార్డు నుండి పోటీ చేస్తున్న ఎంఐఎం అభ్యర్ధి మహ్మద్ ముస్తఫా పై ఏడు కేసులున్నాయి.

మారేడ్‌పల్లి 59 వ వార్డు నుండి బీజేపీ తరపున బరిలో ఉన్న టి.శ్రీనివాస్ రెడ్డిపై 5 కేసులు నమోదయ్యాయి. మోండా మార్కెట్ 150 వార్డు నుండి టీఆర్ఎస్ అభ్యర్ధి తరపున బరిలో ఉన్న ఆకుల రూపపై ఐదు కేసులున్నాయని ఆ సంస్థ తెలిపింది.