ఎన్నికల అధికారుల పేరుతో  నకిలీ ఓటరు కార్డులు జారీ చేసిన అధికారులపై  వేటు పడింది


హైదరాబాద్: ఎన్నికల అధికారుల పేరుతో నకిలీ ఓటరు కార్డులు జారీ చేసిన అధికారులపై వేటు పడింది.

మాజీ సీఈసీ ఓపీ రావత్, తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ పేరుతో నకిలీ ఓటరు కార్డులు జారీ అయ్యాయి.ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా పరిగణించింది. ఈ ఘటనపై జీహెచ్ఎంసీ అధికారులు విచారణ జరిపారు.

సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.మరో వైపు ఈ ఘటనకు బాధ్యులైన నాంపల్లి ఎఈఆర్‌ఓ ఖలీలుద్దీన్‌ను సస్పెండ్ చేశారు.డిప్యూటీ ఈఆర్‌ఓ అలీ, సూపర్‌వైజర్ గిరిధర్‌లకు చార్జీ మోమో జారీ చేశారు. 

సంబంధిత వార్తలు

ఓపీ రావత్, రజత్‌కుమార్‌లకు ఝలక్: వారి పేర్లపై నకిలీ ఓటరు కార్డులు