Asianet News TeluguAsianet News Telugu

తండ్రి రాజకీయ వారసత్వం కోసం.. అమెరికా పౌరసత్వం వదులుకున్న మేయర్...

జీహెచ్ఎంసీ నూతన మేయర్ గా టీఆర్ఎస్ అభ్యర్థి గద్వాల విజయలక్ష్మి ఎన్నికైన విషయం తెలిసిందే. మేయర్ పీఠం కోసం గట్టి పోటీ ఉన్నప్పటికీ టీఆర్ఎస్ విజయలక్ష్మి వైపే మొగ్గు చూపింది. ఈమె సీనియర్ నేత, కేసీఆర్ సన్నిహితుడు కె. కేశవరావు కుమార్తె. 

ghmc new mayor gadwala vijayalakshmi personal details - bsb
Author
Hyderabad, First Published Feb 11, 2021, 4:24 PM IST

జీహెచ్ఎంసీ నూతన మేయర్ గా టీఆర్ఎస్ అభ్యర్థి గద్వాల విజయలక్ష్మి ఎన్నికైన విషయం తెలిసిందే. మేయర్ పీఠం కోసం గట్టి పోటీ ఉన్నప్పటికీ టీఆర్ఎస్ విజయలక్ష్మి వైపే మొగ్గు చూపింది. ఈమె సీనియర్ నేత, కేసీఆర్ సన్నిహితుడు కె. కేశవరావు కుమార్తె. 

బంజారాహిల్స్ డివిజన్ 93 నుండి కార్పొరేటర్ గా రెండుసార్లు ఎన్నికయ్యారు. ఈ సారి ఏకంగా మేయర్ పీఠాన్ని అధిరోహించారు. ఆమె వ్యక్తిగత వివరాలు ఒకసారి చూస్తే.. 

విజయలక్ష్మి బాల్యం, విద్యాభ్యాసం అంతా హైదరాబాద్ లోనే సాగింది. హోలీ మేరీ స్కూల్ లో టెన్త్ వరకు చదివారు. ఆ తరువాత రెడ్డి కాలేజీలో చదివారు. భారతీయ విద్యాభవన్ లో జర్నలిజం పూర్తి చేశారు. జర్నలిజం తరువాత సుల్తానా ఉల్ ఉలూమ్ లా కాలేజీలో ఎల్ఎల్‌బీ పూర్తి చేశారు.

విద్యాభ్యాసం తరువాత విజయలక్ష్మి బాబీరెడ్డిని వివాహం చేసుకుంది. ఆ తరువాత భర్తతో కలిసి అమెరికా వెళ్లారు. 18 యేళ్లపాటు అమెరికాలోనే ఉన్నారు. అగ్రరాజ్యంలోనే ఐదు అతిపెద్ద యూనివర్సిటీల్లో ఒకటైన నార్త్ కరోలినా యూనివర్సిటీలో కార్డియాలజీ డిపార్ట్ మెంట్ లో రీసెర్చ్ అసిస్టెంట్ గా పనిచేశారు. 

అక్కడ ఉన్నప్పుడే అమెరికా పౌరసత్వం వచ్చింది. అయితే రాజకీయాల్లో తండ్రి వారసత్వాన్ని కొనసాగించడం కోసం విజయలక్ష్మి అమెరికా పౌరసత్వాన్ని వదులుకున్నారు. 2007లో భారత్ తిరిగొచ్చారు. 

ఆ తరువాత మొదటిసారిగా 2016లో విజయలక్ష్మి టీఆర్ఎస్ తరఫున బంజారాహిల్స్ కార్పొరేటర్ గా భారీ మెజార్టీతో విజయం సాధించారు. అప్పట్నుంచి బంజారాహిల్స్ డివిజన్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించింది. ఈ విజయంతో ఏకంగా మేయర్‌ పదవిని అలంకరించారు.

ఇక డిప్యూటీ మేయర్ గ తార్నాక డివిజన్ నుంచి ఎన్నికైన మోతే శ్రీలత ఎన్నికయ్యారు. శ్రీలత బీఏ వరకు చదువుకున్నారు. అనంతరం శోభన్ రెడ్డిని వివాహం చేస్తుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు రాజీవి, శ్రీ తేజస్వి. 

గత 20యేళ్లుగా బొటిక్ నిర్వహించారు శ్రీలత. ఆ తరువాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. కొంతకాలంపాటు టీఆర్ఎస్ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. తాజా ఎన్నికల్లో తార్నాక కార్పొరేటర్ గా విజయం సాధించారు మోతే శ్రీలత. ఆ తరుతా డిప్యూటీ మేయర్ పదవిని దక్కించుకున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios