తమిళనాట రాజకీయం రసవత్తరంగా సాగుతున్న వేళ...  శశికళ పేరు అక్కడ హాట్ టాపిక్ గా మారిన వేళ జీహెచ్ఎంసీ కి పాత బకాయి ఒకటి గుర్తుకొచ్చింది

తమిళనాడులో ఉన్న శశికళకు హైదరాబాద్ లో ఉన్న జీహెచ్ఎంసీ ఎందుకు నోటీసులు పంపుతుంది ? ఆమెకు తెలంగాణకు అసలు సంబంధం ఏంటీ... బెంగుళూరు లో జైలుకెళ్తున్న వేళ ఇదేం కొత్త ట్విస్ట్ అనుకుంటున్నారా...

తమిళనాట రాజకీయం రసవత్తరంగా సాగుతున్న వేళ... శశికళ పేరు అక్కడ హాట్ టాపిక్ గా మారిన వేళ జీహెచ్ఎంసీ కి పాత బకాయి ఒకటి గుర్తుకొచ్చింది. అదేంటంటే....

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలితకు హైదరాబాద్ తో విడదీయరాని సంబంధం ఉంది. ఆమె రాజకీయాల్లోకి రాకముందే హైదరాబాద్ శివార్లలలో భారీగా భూములు కొన్నారు. జేజే గార్డెన్ పేరుతో గెస్ట్ హౌజ్ ను కూడా నిర్మించుకున్నారు.

పనిలో పనిగా తన స్నేహితురాలుగా ఉన్న శశికళ పేరు మీద సికింద్రాబాద్‌లోని మారేడ్‌పల్లి రాధిక కాలనీలో ఓ ఇంటిని కూడా కొనేశారు.

ఆ ఇంటికి సంబంధించే జీహెచ్ఎంసీ ఇప్పుడు నోటీసులు పంపింది. గత రెండేళ్లకు రూ. 35,424 ఆస్తి పన్నును ఆ ఇంటి యజమానిగా ఉన్న శశికళ ఇప్పటివరకు చెల్లించలేదు. దీంతో ఈ విషయంపై శశికళకు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు పంపారు.