జరిమానా విధించిన అధికారులు
హైదరాబాద్ అంటేనే బిర్యానీ... బిర్యానీ అంటేనే హైదరాబాద్ అయితే ఇటీవల మన బిర్యానీ తరచూ వార్తాల్లోకి ఎక్కుతోంది. ఎంతోఆశగా ఎదురు చూసిన జిఐ ట్యాగ్ మన బిర్యానీకి అందకుండా పోయింది. మూడో ప్రయత్నంలో కూడా జిఐ ట్యాగ్ ను పొందడంలో మన బిర్యానీ విఫలమైంది.
మరోవైపు నగరంలోని పలు హోటళ్లలో బిర్యానీలో కుక్కమాంసం కలుపుతున్నారంటూ వదంతులు వచ్చాయి. దీంతో బిర్యానీ ప్రియులు భయపడిపోయారు. అవన్నీ రూమర్లే అని తేలడంతో ఊపిరిపీల్చుకున్నారు.
ఇప్పుడు మరో వార్తతో బిర్యానీ సెంటర్లు వార్తల్లోకి వచ్చాయి. నగరంలోని పేరుపొందిన చాలా హోటళ్లల్లో అపరిశుభ్ర మాంసాన్ని వాడుతున్నారని అధికారులు గుర్తించారు. అలాగే మరికొన్ని హోటళ్లు ఎలాంటి అనుమతి లేకుండానే నడుస్తున్నట్లు గమనించారు. అలాంటి హోటళ్లను సీజ్ చేసి భారీ జరిమానా విధించారు.
సాగర్ రోడ్డులో ఉన్న ఓ హోటల్ కు రూ. 40 వేలు జరిమానా విధించగా, ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఉన్న ఆస్టోరియా కు రూ. 20 వేలు ఫైన్ వేశారు. అనుమతి లేకుండా నడుపుతున్న ఓ ప్యారడైజ్ బ్రాంచ్ కు కూడా రూ. 20 వేలు జరిమానా విధించారు.
