దుబ్బాక తరువాత ఆ స్థాయిలో ఉత్కంఠ రేపాయి జీహెచ్ఎంసీ ఎన్నికలు. ఈ రోజు ఉదయం నుండి  మొదలైన కౌంటింగ్ క్షణక్షణం ఉత్కంఠతో సాగుతోంది. కూకట్ పల్లీ జోన్ లో టీఆర్ఎస్ సత్తా చాటింది. అధిక స్థానాల్లో ఘన విజయం సాధించింది. 

ఉదయం నుంచి చెబుతున్నట్టుగా పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ ఆధిక్యం కనబరిచినా అది పెద్దగా లెక్కలోని తీసుకోవాల్సిన విషయం కాదని నిపుణులు చెబుతున్నమాటే నిజమయ్యింది. సాధారణ ఓటల్ లెక్కింపులో అది పూర్తిగా బయటపడింది. 

రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్నాయి.సాధారణ ఓట్ల లెక్కింపు మొదలైన ఫస్ట్‌ రౌండ్‌లోనే టీఆర్‌ఎస్‌ హవా మొదలైంది. ఒకటి, రెండు, మూడు,..ఇలా గులాబీ పార్టీ విజయం సాధించిన స్థానాల సంఖ్యలో పెరుగుతూ వస్తోంది. 

ముఖ్యంగా కూకట్‌పల్లి జోన్‌లో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించింది. కూకట్‌పల్లి జోన్‌లో ఉన్న 22 డివిజన్లలో 20 డివిజన్లలో టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. 

అయితే బీజేపీ పూర్తిగా సీట్లు గెలుచుకోలేకపోతున్నా ఫలితాలను బట్టి చూస్తుంటే టీఆర్ఎస్ కు గట్టి పోటీనే ఇస్తుంది.