Asianet News TeluguAsianet News Telugu

జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు: మంత్రులకు భారీ షాక్

తెలంగాణ మంత్రులు ఇంచార్జీలుగా వ్యవహరించిన కొన్ని చోట్ల జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి పాలైంది. సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి వంటి మంత్రులకు ఈ ఎన్నికలు షాక్ ఇచ్చాయి.

GHMC Elections 2020: Results give shock to ministers
Author
Hyderabad, First Published Dec 4, 2020, 6:50 PM IST

హైదరాబాద్: జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు కొంత మంది మంత్రులకు షాక్ ఇచ్చాయి. మంత్రులు ఇంచార్జీలుగా వ్యవహరించిన డివిజన్లలో టీఆర్ఎస్ ఓటమి పాలైంది. శ్రీనివాస్ గౌడ్ ఇంచార్జీగా వ్యవహరించిన అడిక్ మెట్ లో టీఆర్ఎస్ పరాజయం పాలైంది. ఇలాగే, మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంచార్జీగా వ్యవహరించిన ఆర్కెపురంలో బిజెపి విజయం సాధించింది. 

మంత్రి జగదీష్ రెడ్డి ఇంచార్జీగా వ్యవహరించిన సరూర్ నగర్ లో టీఆర్ఎస్ ఓటమి పాలైంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ నియోజకవర్గంలో మూడు చోట్ల టీఆర్ఎస్ పరాజయం పాలైంది.

ఇదిలావుంటే, తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల కవితకు బిజెపి వరుస షాక్ లు ఇస్తోంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బిజెపి ఆమెకు షాక్ ఇచ్చింది. గాంధీనగర్ డివిజన్ లో బిజెపి విజయం సాధించింది. దీంతో కవితకు చేదు అనుభవం ఎదురైంది.

జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గాంధీనగర్ డివిజన్ ను బాధ్యతలను కవిత తీసుకున్నారు. ఆమె గాంధీనగర్ డివిజన్ లో విస్తృతంగా ప్రచారం సాగించారు అయినప్పటికీ టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. ఇది కవితకు బిజెపి నుంచి తగిలిన మరో దెబ్బ.

నిజామాబాద్ లోకసభ ఎన్నికల్లో బిజెపి కవితను ఓడించింది. లోకసభ ఎన్నికల్లో బిజెపి నేత ధర్మపురి అరవింద్ కవితను ఓడించారు. దాంతో ఆమె చాలా కాలం రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. చివరకు నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీగా విజయం సాధించారు. స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎన్నికల్లో ఆమె ఘన విజయం సాధించారు. 

కొన్ని చోట్లు టీఆర్ఎస్ ప్రముఖుుల ఓటమి పాలయ్యారు. ముషీరాబాద్ లో మాజీ హోం మంత్రి, దివంగత నేత నాయిని నర్సింహా రెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి ఓటమి పాలయ్యారు. 

Follow Us:
Download App:
  • android
  • ios