హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్లు పెద్దగా ఆసక్తిని చూపడం లేదు. మంగళవారం నుండి ఉదయం పూట కూడా ఇదే పరిస్థితి నెలకొంది. సాయంత్రం నాలుగు గంటల వరకు 29.76 శాతం పోలింగ్ నమోదైంది.

కారణం ఏదో తెలియదు కానీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ కు ఓటర్లు ఆసక్తిని చూపలేదు. దీంతో కొన్ని డివిజన్లలో 5 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది.మధ్యాహ్నం ఒంటి గంట వరకు 14 డివిజన్లలో కేవలం 5 శాతం ఓట్లు మాత్రమే నమోదు కావడాన్ని చూస్తే ఓటింగ్ పట్ల ప్రజల అనాసక్తిని తెలుపుతోంది.

also read:జాంబాగ్‌ డివిజన్‌లో ఉద్రిక్తత: ఎంఐఎం, టీఆర్ఎస్ మధ్య ఘర్షణ వాతావరణం

రెయిన్‌బజార్, కార్వాన్, తలాబ్ చంచలం, అల్విన్ కాలనీ, అమీర్ పేట, కంచన్ బాగ్, షేక్‌పేట, సోమాజీగూడ, శాలిబండ, అత్తాపూర్, సుభాష్ నగర్, జంగంమెట్ లలో తక్కువ సంఖ్యలో ఓటర్లు ఓటింగ్ లో పాల్గొన్నారు. 

కొన్ని డివిజన్లలో అతి కష్టం మీద 10 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది.  ఆర్ కే పురం 19.96, డబీర్ పురా 19.47, రెయిన్ బజార్ లో 19.96, చంద్రాయణగుట్ట 19 ,జహనుమా 15.67, మల్లేపల్లి 19.47, నానల్ నగర్ 19.13, గోషామహల్ 16.03, మంగళ్ హాట్ 19.69 . కొండాపూర్ 19.64, ఓల్డ్ బోయిన్ పల్లి 18.18, మొండా మార్కెట్ 14.37శాతం ఓటింగ్ నమోదైందని అధికారులు తెలిపారు.