హైదరాబాద్: జాంబాగ్ డివిజన్ లో తనపై ఎంఐఎం నేతలు  దాడికి ప్రయత్నించారని టీఆర్ఎస్ అభ్యర్ధి ఆనంద్ గౌడ్ ఆరోపించారు.మంగళవారం నాడు జాంబాగ్ డివిజన్ లోని జూబ్లీ హైస్కూల్ లో ఎంఐఎం రిగ్గింగ్ కు ప్రయత్నిస్తున్నారని టీఆర్ఎస్ ఆరోపించారు. ఎంఐఎం నేతలు దాడికి పాల్పడ్డారని టీఆర్ఎస్ ఆరోపించింది. ఈ డివిజన్ లో పోలీసులు ఎంఐఎంతో కుమ్మక్కయ్యారని టీఆర్ఎస్ ఆరోపించారు.

పాతబస్తీపై కూడా టీఆర్ఎస్ కేంద్రీకరించింది. గతంలో పాతబస్తీలో ఐదు కార్పోరేట్ స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. ఈ దఫా 10  కార్పోరేట్ స్థానాలను కైవసం చేసుకొంటామని టీఆర్ఎస్ ధీమాగా ఉంది. 

ఈ ఎన్నికల్లో నగరంలో పలు చోట్ల ఘర్షణలు చోటు చేసకొన్నాయి. బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణలు ఎక్కువగా జరిగినట్టుగా నివేదికలు అందాయి. నాచారం ఆరో డివిజన్ లో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఘర్షణలు చోటు చేసుకొన్నాయి. 

జీహెచ్ఎంసీ ఎన్నికలను మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి.ఈ ఎన్నికల్లో మరోసారి బల్దియాపై గులాబీ జెండాను ఎగురవేయాలని టీఆర్ఎస్ ప్లాన్ చేసింది. జీమెచ్ఎంసీపై బీజేపీ జెండాను ఎగురవేస్తామని బీజేపీ ధీమాగా ఉంది. గతంలో కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఎంఐఎం గతంలో కంటే ఎక్కువ సీట్లను దక్కించుకొంటామనే  ధీమాతో ఉంది.