హైదరాబాద్: జీహీచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో అసత్యప్రచారాలకు పాల్పడుతున్నవారికి హైదరాబాదు పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు ట్విటర్ లో ఓ వీడియోను పోస్టు చేశారు. హైదరాబాదులో ఏదో జరుగుతుందని ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. 

హైదరాబాదులో మతఘర్షణలు రెచ్చగొట్టడానికి జరుగుతుందని ఆయన అన్నారు. సోషల్ మీడియా ప్రచారాలను నమ్మవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయని, హైదరాబాదు నగరమూ ప్రజలూ శాశ్వతమని ఆయన 

హైదరాబాదులో ఏ విధమైన అవాంఛనీయమైన సంఘటనలు జరిగినా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆయన అన్నారు. మతఘర్షణలు సృష్టించాలని ప్రయత్నించేవారిపై, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని ఆయన హెచ్చరించారు. 

ఓట్లను పొందడానికి, ప్రజల హృదయాలను గెలవడానికి నాయకులంతా కఠినంగా శ్రమిస్తున్నారని ఆయన అన్నారు. ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆలయం వంటివని, ఈ స్థితిలో కొన్ని దుష్టశక్తులు సోషల్ మీడియా ద్వారా మత వివాదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు.