Asianet News TeluguAsianet News Telugu

జిహెచ్ఎంసీ ఎన్నికలు: పుంజుకున్న బిజెపి, కేసీఆర్ కు ముప్పే

జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను బిెజెపి దెబ్బ తీసినట్లుగానే కనిపిస్తోంది. గత ఎన్నికల్లో సాధించిన సీట్ల కన్నా టీఆర్ఎస్ తక్కువ స్థానాలను గెలుచుకునే అవకాశాలున్నాయి. ఇది భవిష్యత్తు తెలంగాణ రాజకీయాలకు సంకేతమని అంటున్నారు.

GHMC Elections 2020: BJP poses threat to TRS in Telangana
Author
Hyderabad, First Published Dec 4, 2020, 1:58 PM IST

హైదరాబాద్: జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బిజెపి చెప్పినంతగా సత్తా చాటలేదు. కానీ బిజెపికి సంతృప్తికరమైన ఫలితాలే వస్తున్నాయి. భవిష్యత్తులో టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాల్ విసిరే స్థాయికి ఎదుగే అవకాశాలున్నట్లు జిహెచ్ఎంపీ ఫలితాలు తెలియజేస్తున్నాయి. 

మొత్తం 150 డివిజన్లలకు సంబంధించిన ఆధిక్యాలు బయటపడ్డాయి. తాజాగా టీఆర్ఎస్ 70, ఎంఐఎం 45, కాంగ్రెసు 4 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. బిజెపి 30 స్థానాల్లో బిజెపి ఆధిక్యంలో కొనసాగుతోంది. దాదాపుగా కొంచెం అటూ ఇటుగా ఈ మేరకే ఫలితాలు రావచ్చు.

దుబ్బాక శాసనసభ ఉప ఎన్నికలో విజయం సాధించిన తర్వాత గ్రేటర్ హైదరాబాదుపై కాషాయం జెండా ఎగురవేస్తామని బిజెపి నేతలు ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. కానీ అంతగా వారు సత్తా చాటలేకపోయారు. కానీ ఇది బిజెపి నిరాశాజనకమైన ఫలితాలేమీ కావు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బిజెపి టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అవుతుందనడానికి సంకేతంగా నిలుస్తున్నాయి. 

గత ఎన్నికల్లో టీఆర్ఎస్ 99, ఎంఐఎం 44, కాంగ్రెసు 2, టీడీపీ 1 స్థానాల్లో విజయం సాధించగా బిజెపి కేవలం 3 డివిజన్లలో మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుత ఫలితాలను చూస్తే బిజెపి పెద్ద యెత్తున గ్రేటర్ హైదరాబాదులో పుంజుకుందని చెప్పవచ్చు. 

జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ ప్రధాన ప్రత్యర్థిగా ఎంఐఎంను చూపించింది. ఎంఐఎం తన పట్టును నిలబెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్  గతంలో కన్నా తక్కువ డివిజన్లను గెలుచుకునే పరిస్థితి కనిపిస్తోంది. టీఆర్ఎస్ ను బిజెపి గణనీయంగా దెబ్బ తీసే పరిస్థితి కనిపిస్తోంది.

ప్రస్తుత పలితాలను చూస్తే జిహెచ్ఎంసీ ఎన్నికలు టీఆర్ఎస్ కు ప్రమాద ఘంటికలను మోగించినట్లుగానే భావించవచ్చు. భవిష్యత్తులో బిజెపి టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఏ మాత్రం తన ఉనికిని చాటుకోలేకపోయింది. కాంగ్రెసు గత ఫలితాలనే పునరావృతం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెసును బిజెపి వెనక్కి నెట్టి ముందుకు వచ్చే అవకాశాలు తెలంగాణలో ఉన్నాయి.

దుబ్బాక ఎన్నిక ఫలితం మాత్రమే కాకుండా జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఆ విషయాన్ని తెలియజేస్తున్నాయి. బిజెపి ప్రచారం పెద్ద యెత్తున దూకుడు ప్రదర్శించింది. ఈ దూకుడు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios