Asianet News TeluguAsianet News Telugu

ఏమిటీ ... తెలంగాణ సీఎంకు తెలియకుండానే ఏపీ మాజీ సీఎం ఇంటివద్ద కూల్చివేతలా..!!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియకుండానే ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం లోటస్ పాండ్ వద్ద కూల్చివేతలు జరిగాయంట..!! నమ్మశక్యంగా లేకున్నా ఇదే జరిగిందట..

GHMC demolished outside constructions of YS Jagan House in Hyderabad AKP
Author
First Published Jun 17, 2024, 3:29 PM IST

హైదరాబాద్ : తెలంగాణ రాజధానిపై హైదరాబాద్ లో ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటివద్ద కూల్చివేతలు రాజకీయ దుమారం రేపుతోంది.   వైఎస్ జగన్ పై కక్షసాధింపులో భాగంగానే ఈ కూల్చివేతలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు కోసమే వైఎస్ జగన్ ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేసారని... అందులో భాగమే ఈ కూల్చివేతలని ఆరోపణలు వస్తున్నాయి. అయితే హైదరాబాద్ లోని వైసిపి అధినేత ఇంటివద్ద కూల్చివేతల వ్యవహారంపై ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.  

జూబ్లీహిల్స్ లోని వైఎస్ జగన్ నివాసం లోటస్ పాండ్ వద్ద నిర్మాణాలను కూల్చివేయించిన జిహెచ్ఎంసి అధికారిపై వేటు పడింది. ఖైరతాబాద్ జోనల్ కమీషనర్ హేమంత్ బోర్కడేపై జిహెచ్ఎంసి ఇంచార్జీ కమీషనర్ ఆమ్రపాలి యాక్షన్ తీసుకుంది... ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం లేకుండానే ఈ కూల్చివేతలు చేపట్టమేంటని ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసారు. హేమంత్ ను  జోనల్ కమీషనర్ బాధ్యతల నుండి తప్పించి  జిఐడిలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసారు. 

ఇలా లోటస్ పాండ్ వద్ద కూల్చివేతలు చేపట్టిన అధికారిపై వేటు పడటంతో మరో ప్రచారం జోరందుకుంది. ఈ వ్యవహారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిహెచ్ఎంసి అధికారులకు గాని సంబంధం లేదని... ఓ మంత్రిగారి కోసమే జోనల్ కమీషనర్ ఈ పని చేసారట. లోటస్ పాండ్ సమీపంలో నివాసముండే ఓ మంత్రి ఆదేశాలతోనే మాజీ సీఎం ఇంటివద్ద కొత్తగా చేపట్టిన నిర్మాణాలను కూల్చివేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. 

అయితే ఈ ప్రచారాన్ని కొందరు కొట్టిపారేస్తున్నారు. అసలు రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియకుండానే మరో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నివాసంపైకి జేసిబిలు వెళ్లడం అసాధ్యం అంటున్నారు. చంద్రబాబుకు గురుదక్షిణగా రేవంత్ ఈ పని చేయించారని ప్రచారం జరుగుతుండటంతోనే కొత్త నాటకానికి తెరలేపారని అంటున్నారు. సీఎంకే కాదు తమకు కూడా లోటస్ పాండ్ వద్ద నిర్మాణాల కూల్చివేత గురించి తెలియదని నమ్మించేందుకే జిహెచ్ఎంసి ఉన్నతాధికారులు జోనల్ కమీషనర్ ను బలి చేసారని అంటున్నారు. 

వాస్తవానికి జగన్ నివాసం వద్ద కూల్చివేతలు రేవంత్ రెడ్డి చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు కోసం ఇదంతా చేయడంతో సొంత పార్టీలోనే వ్యతిరేకత ఎదురయ్యిందట... ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం నుండి వ్యతిరేకత ఎదురయ్యిందట. దీంతో మాటమార్చిన రేవంత్ తనకి తెలియకుండానే ఇదంతా జరిగిందంటూ ఓ అధికారిని బదిలీ చేసి చేతులు దులుపుకున్నట్లు తెలుస్తోంది. 

అసలేం జరిగింది :

గత శనివారం జూబ్లీహిల్స్ లోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం లోటస్ పాండ్ వద్దకు జిహెచ్ఎంసి  అధికారులు జేసిబిలతో కూల్చివేతలు చేపట్టారు. సెక్యూరిటీ సిబ్బంది కోసం కొత్తగా నిర్మించిన గదులను కూల్చివేసారు. రోడ్డును ఆక్రమించుకుని ఈ నిర్మాణాలను చేపట్టడంవల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోందని ఫిర్యాదులు అందడంతోనే ఈ కూల్చివేతలు చేపట్టినట్లు  అధికారులు తెలిపారు. 

ఖైరతాబాద్ జోనల్ కమీషనర్ ఆదేశాల మేరకు ఏసిపి సంపత్ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసారు. జిహెచ్ఎంసి అధికారుల పర్యవేక్షణలో  లోటస్ పాండ్ ప్రహారిగోడకు ఆనుకుని నిర్మించిన నాలుగు గదులను కూల్చివేసారు.  అయితే ఈ కూల్చివేతలపై జగన్ కుటుంబసభ్యులు గానీ, వైసిపి నాయకులు గాని స్పందించలేదు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios