Asianet News TeluguAsianet News Telugu

''నగరవాసులూ జాగ్రత్త....ఆ రెండు గంటలే టపాసులు కాల్చాలట''

దీపావళి పండగ కదా అని ఎప్పటిలాగే రోజంతా టపాసులు కాలుస్తామంటే కుదరదని హైదరాబాద్ నగరవాసులకు జీహెచ్ఎంసీ హెచ్చరిస్తోంది. సుప్రీం కోర్టు తీర్పును పక్కాగా అమలు చేస్తామని జీహెచచ్ఎంసీ కమీషనర్ దానకిషోర్ వెల్లడించారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ టపాసులు కాల్చే అంశంపై హైదరాబాద్ లో అమలయ్యే నిబంధనల గురించి దానకిషోర్ ప్రత్యేకంగా ఓ ప్రకటన విడుదల చేశారు.  

ghmc commissioner danakishore statements about diwali crackers
Author
Hyderabad, First Published Nov 5, 2018, 8:42 PM IST

దీపావళి పండగ కదా అని ఎప్పటిలాగే రోజంతా టపాసులు కాలుస్తామంటే కుదరదని హైదరాబాద్ నగరవాసులకు జీహెచ్ఎంసీ హెచ్చరిస్తోంది. సుప్రీం కోర్టు తీర్పును పక్కాగా అమలు చేస్తామని జీహెచచ్ఎంసీ కమీషనర్ దానకిషోర్ వెల్లడించారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ టపాసులు కాల్చే అంశంపై హైదరాబాద్ లో అమలయ్యే నిబంధనల గురించి దానకిషోర్ ప్రత్యేకంగా ఓ ప్రకటన విడుదల చేశారు.

రహదారులపై, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరక్కుండా ప్రమాదకర, భారీ శబ్దాలను చేసే పటాకులు కాల్చకుండా నిషేదం  విధించినట్లు తెలిపారు. అలాగే చిన్నారులతో పెద్దవారు కూడా ఈ టపాసులు కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు వహించాలని సూచించారు.

దీపావళి పండగరోజు రాత్రి 8గంటల నుండి 10 గంటల  వరకు మాత్రమే టపాసులు కాల్చాలని దానకిషోర్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు. అది కూడా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండ‌లి నిర్ధారించిన నిబంధనలకు అనుగుణంగా ఉండాలని సూచించారు. 

దిపావళి సందర్భంగా కాల్చే టపాసులు, బాణాసంచాల కారణంగా పర్యావరణానికి హాని కలుగుతుందంటూ దాఖలైన పిటిషన్ పై విచారించిన అత్యత్తమ న్యాయస్థానం కొన్ని పరిమితులు విధిస్తూ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు నిబంధనలు తప్పనిసరిగా పాటింపజేయడానికి చర్యలు తీసుకున్నట్లు కమీషనర్ దానకిషోర్ తెలిపారు.
 
Follow Us:
Download App:
  • android
  • ios