బైండింగ్ వైర్ తో గొంతు నులిమి, కనుగుడ్లు పెరికి హత్య

Ghastly murder in Kumram Bheem district of Telangana
Highlights

చేతబడి చేస్తున్నాడనే నెపంతో ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేశారు. కుమ్రం భీమ్ జిల్లా గిన్నెలహట్టి గ్రామంలో ఈ సంఘటన జరిగింది.

ఆసిఫాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని కుమ్రం భీమ్ జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. చేతబడి చేస్తున్నాడనే నెపంతో ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేశారు. కుమ్రం భీమ్ జిల్లా గిన్నెలహట్టి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. 

నలుగురు వ్యక్తులు ఆ హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. పోలీసుుల సంఘటనా స్థలాన్ని సందర్శించి, శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

అతన్ని కట్టేసి కొట్టి హత్య చేసినట్లు భావిస్తున్నారు. ఇంటి ముందున్న వ్యక్తులే ఆ దారుణానికి పాల్పడి ఉంటారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చేతబడి నెపంతోనే అతన్ని హత్య చేశారా, హత్యకు మరేదైనా కారణం ఉందా అనేది తెలియడం లేదు.

పోలీసులు కూడా ఇప్పుడే ఏ విషయమూ చెప్పలేమని అంటున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. 

loader