ఖమ్మం: ఖమ్మం జిల్లా కేంద్రంలోని చర్చి కాంపౌండ్ లో బుధవారం నాడు గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. క్షతగాత్రులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.గ్యాస్ సిలిండర్ పేలుడుకు కారణాలు తెలియరాలేదు. 

 

ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు సమాచారం ఇచ్చారు.  సంఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను ఆర్పారు.

గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మరో వైపు ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స  అందిస్తున్నారు.తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో తరచుగా గ్యాస్ సిలిండర్లు పేలుతున్నాయి. అయితే ఈ తరహా ఘటనలు ఎందుకు జరుగుతున్నాయనేది నిపుణులు తేల్చాలని పలువురు కోరుతున్నారు.