Asianet News TeluguAsianet News Telugu

వేస్ట్ పేపర్ తో గాంధీ విగ్రహం: ఆవిష్కరించిన మంత్రి హరీష్ రావు

 పర్యావరణ గాంధీ విగ్రహాన్ని ఆర్ధిక మంత్రి తన్నీరు హరీశ్​రావు ఆవిష్కరించారు. జాతిపిత మహాత్మగాంధీ 150వ జయంతి సందర్భంగా ఎంసీహెచ్చార్డీలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 

Gandhi statue with waste paper at hyderabad, launched by ts minister harish rao
Author
Hyderabad, First Published Oct 1, 2019, 6:20 PM IST

హైదరాబాద్: మహాత్మగాంధీజి 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా వేస్ట్ పేపర్ తో గాంధీ విగ్రహాన్ని రూపొందించారు వరంగల్ జిల్లాకు చెందిన ప్రముఖ ఆర్టిస్ట్ సిలివేరు మనోహర్. వేస్ట్ పేపర్ తో తయారు చేసిన ఈ  గాంధీ విగ్రహాన్ని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఏర్పాటు చేశారు. 

పర్యావరణ గాంధీ విగ్రహాన్ని ఆర్ధిక మంత్రి తన్నీరు హరీశ్​రావు ఆవిష్కరించారు. జాతిపిత మహాత్మగాంధీ 150వ జయంతి సందర్భంగా ఎంసీహెచ్చార్డీలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. డైరెక్టర్​ జనరల్​ బీపీ ఆచార్య విగ్రహాన్ని ఆవిష్కరించాలని మంత్రి హరీష్ రావు ను ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా శిల్పి సిలివేరు మనోహర్ ను అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావుకి మహాత్మగాంధీ చిత్రపటాన్ని అందజేశారు డైరెక్టర్ జనరల్ బీపీ ఆచార్య.  

Follow Us:
Download App:
  • android
  • ios