హైదరాబాద్: అక్రమ మైనింగ్ కేసులో  ఈడీ ఎదుట గాలి జనార్ధన్ రెడ్డి హాజరయ్యారు. 2007లో అక్రమ మైనింగ్ వ్యవహారంలో గాలి జనార్ధన్ రెడ్డిపై కేసు నమోదైన విషయం తెలిసిందే.

బళ్లారి ప్రాంతంలో ప్రభుత్వానికి తక్కువ రాయిల్టీని చెల్లిస్తూ ఎక్కువ మైనింగ్ తవ్వినట్టుగా ఆరోపణలు వచ్చాయి. లోకాయుక్తలో కూడ ఈ విషయమై కేసులు దాఖలయ్యాయి.

అక్రమ మైనింగ్  విషయంలో  దాఖలైన కేసులో  గాలి జనార్ధన్ రెడ్డి తొలిసారిగా ఈడీ ముందు సోమవారం నాడు హాజరయ్యారు. గాలి జనార్ధన్ రెడ్డి అక్రమంగా  మైనింగ్ చేస్తున్నారని  ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఆ సమయంలో టీడీపీ శాసనసభపక్షఉప నేతగా ఉన్న నాగం జనార్ధన్ రెడ్డి గాలి జనార్ధన్ రెడ్డి అక్రమాలపై అసెంబ్లీలో గళమెత్తారు.