గద్వాల జిల్లా పరిషత్ సీఈఓ ప్రభుత్వానికి సరెండర్: కన్నీళ్లు పెట్టుకున్న విజయ నాయక్
గద్వాల జిల్లా పరిషత్ సీఈఓ విజయనాయక్ కన్నీళ్లు పెట్టుకున్నారు. జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి సీఈఓ విజయ నాయక్ ను సరెండర్ చేయడంతో భావోద్వేగానికి గురయ్యారు.
మహబూబ్‌నగర్: గద్వాల జిల్లా పరిషత్ సీఈఓ విజయ నాయక్ ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ జిల్లా కలెక్టర్ శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయమై మంత్రి నిరంజన్ రెడ్డికి జిల్లా పరిషత్ సీఈఓ ఫోన్ చేసి కన్నీళ్లు పెట్టుకున్నారు. తనను కలెక్టర్ సరెండర్ చేయడంపై న్యాయ పోరాటం చేస్తానని సీఈఓ విజయనాయక్ తెలిపారు.
గద్వాల జిల్లా పరిషత్ సీఈఓ విజయ నాయక్ ను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి శనివారం నాడు పంచాయితీరాజ్ శాఖకు సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ ఉత్తర్వులపై జిల్లా పరిషత్ సీఈఓ విజయ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. విధుల నిర్వహణలో జాప్యం , ఇతర అంశాల ఆధారంగా జిల్లా పరిషత్ సీఈఓ విజయ నాయక్ ను సరెండర్ చేసినట్టుగా సమాచారం. అయితే తనను పంచాయితీరాజ్ శాఖకు సరెండర్ చేయడంపై జిల్లా పరిషత్ సీఈఓ విజయ నాయక్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రెండేళ్లుగా తనను కలెక్టర్ అవమానిస్తున్నారని జిల్లా పరిషత్ సీఈఓ విజయ నాయక్ ఆరోపించారు. అయితే విజయనాయక్ ఆరోపణలను జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి తోసిపుచ్చారు. విధుల్లో నిర్లక్ష్యంతో పాటు ఇతరత్రా కారణాలతోనే ఆమెను సరెండర్ చేయాల్సి వచ్చిందని ఆమె ఆరోపించారు.
కలెక్టర్ తనను సరెండర్ చేయడంపై సీఈఓ విజయ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలను జిల్లా మంత్రి నిరంజన్ రెడ్డికి ఫోన్ చేసి వివరించారు. ఉద్దేశ్యపూర్వకంగానే తనను సరెండర్ చేశారని ఆమె ఆరోపించారు. తనను సరెండర్ చేయడంపై సీఈఓ విజయ నాయక్ కన్నీళ్లు పెట్టుకున్నారు. తనను సరెండర్ చేయడంపై న్యాయపోరాటం చేుస్తానని జిల్లా పరిషత్ సీఈఓ విజయ నాయక్ చెప్పారు.