కరోనా వైరస్ మహమ్మారి ప్రస్తుతానికి ప్రపంచాన్ని వణికిస్తున్న ఒక ప్రధాన సమస్య. ఈ సమస్యకు ఇంతవరకు వాక్సిన్ రాకపోవడంతో... ఈ వైరస్ తో ఆ వాక్సిన్ వచ్చేవరకు మానవులు సహజీవనం చేయక తప్పదు. 

ఇలా కరోనా వైరస్ తో జీవించే కాలంలో మనుషులు భౌతిక దూరాన్ని పాటించడంతోపాటుగా తమ పాత అలవాట్లను కూడా మార్చుకోవాలి. గతంలో ఊరికే చెవుల్లో ముక్కుల్లో వేళ్ళు పెట్టుకోవడం, ఇతరులతో కరచాలనం చేయడం వీటన్నికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే!

ఎంత మనసులో ఈ విషయాలను మనసులో పెట్టుకొని నడుచుకున్నప్పటికీ.... యధాలాపంగా మనం వాటిని మర్చిపోయి ఆస్కారం కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఇలా మనల్ని ఇలాంటి పనులు చేయబోయే ముందు మనల్ని ఎవరైనా హెచ్చరిస్తే బాగుండు అనిపిస్తుంది కదా!

ఇదే ఆలోచన వచ్చిన మన తెలంగాణ అమ్మాయి ఆ దిశగా ఆలోచించి ఒక వాచ్ ని రూపొందించింది ఈ భావి శాస్త్రవేత్త! కేవలం 50 రూపాయల ఖర్చుతో మనం చేయి ఎత్తి కరచాలనం చేయబోయేముందు, ముక్కు దగ్గర పెట్టుకోబోయే ముందు అలారం మోగించి కరోనా వైరస్ విషయంలో పాటించాల్సిన భౌతిక దూరం విషయాన్నీ మనకు గుర్తుచేసే వాచ్ ను కనిపెట్టింది.  తద్వారా మనం ఒక్కసారిగా అలెర్ట్ అవుతాము. 

జోగులాంబ గద్వాల్ జిల్లా చింతలకుంట జిల్లా పరిషత్ పాఠశాలలో ఈ చిన్నారి శ్రీజ 9వ తరగతి చదువుతుంది. చేతిని పైకెత్తగానే 9వోల్ట్ల బ్యాటరీకి కలిపి ఉన్న వైర్లు బజర్ మోగిస్తాయి. చెయ్యి పైకి లేపగానే ఇలా అలారమ్ మోగి మనల్ని అలెర్ట్ చేస్తుంది. 

ఇంతకు ఈ అమ్మాయి కరోనా వైరస్ భారతదేశంలో విస్తరిస్తుందనగానే ఈ వాచ్ ని రూపొందించింది. ఇంతకు దీనికి ఎంత సమయం పట్టిందో తెలుసా? కేవలం మూడు రోజులు మాత్రమే!

ఈ అమ్మాయి గతంలో కూడా పొలాల మీద పది అడవి పందులు పంటను నాశనం చేస్తుంటే సైరెన్ మోగి రైతులు అలెర్ట్ అయ్యేలా ఒక వ్యవస్థను తయారు చేసింది. ఈ ఆవిష్కరణ తరువాత అమ్మాయికి చెన్నైలో జరిగిన దక్షిణ భారతదేశంలో జరిగే సైన్స్ ఎగ్జిబిషన్ లో స్థానం కల్పించింది. 

ఆ చిట్టి శాస్త్రవేత్త భవిష్యత్తులో సమాజానికి అవసరమయ్యే మరిన్ని ఆవిష్కరణలు చేయాలనుకున్నట్టు తెలిపింది. భవిష్యత్తులో బాగా చదువుకొని ఐఏఎస్ అవ్వాలనుకున్నట్టు చెబుతుంది ఈ చిన్నారి శ్రీజ.