బీజేపీ విజయ సంకల్ప్ యాత్ర: హాజరైన ప్రజా యుద్ధ నౌక గద్దర్
బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ పాల్గొన్నారు. ఆదివారం నాడు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ విజయ పంకల్ప సభలో పాల్గొనాలని గద్దర్ కు బీజేపీ నేతలు ఆహ్వానం పలికారు.
హైదరాబాద్: BJP విజయ సంకల్ప సభకు ప్రజా యుద్ధ నౌక Gaddar హాజరయ్యారు. ఆదివారం నాడు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ విజయ సంకల్ప సభను నిర్వహించారు.ఈ సభకు బీజేపీ నేతలు ఆహ్వానించినట్టుగా గద్దర్ తెలిపారు.
ప్రధానమంత్రి Narendra Modi ప్రసంగం వినేందుకు తాను ఈ సభకు వచ్చినట్టుగా గద్దర్ తెలిపారు. జాతీయ, అంతర్జాతీయంగా ప్రధానమంత్రి మోడీ అవగాహన గురించి తెలుసుకొనేందుకు తాను ఈ సభకు హాజరైనట్టుగా చెప్పారు. మరో వైపు తెలంగాణ గురించి మోడీ ఏం చెబుతారో కూడా తనకు ఆసక్తి ఉందన్నారు. అవకాశం వస్తే తాను ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తానని గద్దర్ చెప్పారు. Vijaya Sankalpa Sabhaలో పాల్గొనాలని బీజేపీ నేతలు ఆహ్వానించి పాస్ కూడా అందించారని గద్దర్ మీడియాకు చెప్పారు. ఈ కారణంగానే తాను ఈ సభకు హాజరయ్యాయని ఆయన చెప్పారు. బీజేపీ సభకు గద్దర్ హాజరు కావడం ప్రస్తుతం రాజకీయంగా చర్చకు దారి తీసింది.
ఈ ఏడాది మార్చి 15న తుక్కుగూడలో జరిగిన బీజేపీ సభలో కూడా గద్దర్ పాల్గొన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ముగింపును పురస్కరించుకొని నిర్వహించిన సభలో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సభలో కూడా గద్దర్ పాల్గొన్నారు. ఈ సమయంలోనే కేంద్ర మంత్రి అమిత్ షా కి గద్దర్ వినతి పత్రం సమర్పించారు. తనపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని గద్దర్ అమిత్ షా ను కోరారు.
2018 ఎన్నికలకు ముందు గద్దర్ తనయుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సమయంలో గద్దర్ ఆయన భార్య, ఆయన కొడుకు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల సభల్లో రాహుల్ గాంధీతో కలిసి గద్దర్ పాల్గొన్నారు.
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో పీపుల్స్ వార్ కి అనుబంధంగా ఉన్న జననాట్యమండలిలో గద్దర్ కీలకంగా వ్యవహరించారు. గద్దర్ పాటలతో ఆ కాలంలో అనేక మంది పీపుల్స్ వార్ లో చేరారనే చెబుతారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రం నుండి గద్దర్ అడవి నుండి బయటకు వచ్చారు. పీపుల్స్ వార్ ఉద్యమంలో పనిచేసే సమయంలో గద్దర్ పై అనేక కేసులున్నాయి. విప్లవోద్యమానికి దూరంగా ఉంటానని గతంలోనే ప్రకటించారు.
తెలంగాణ ఉద్యమంలో గద్దర్ తన వంతు పాత్ర పోషించారు. భద్రాచలం సీతారామస్వామిని, యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాలను కూడా గద్దర్ సందర్శించారు. కుటుంబ సభ్యులతో కలిసి గద్దర్ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. యాద్రాద్రి ఆలయ పనులను ఆయన పరిశీలించారు. యాదాద్రి ఆలయంలో పనులను పరిశీలించిన సమయంలో ఆయన ఆలయంపై తనదైన శైలిలో పాట పాడారు.