నిర్మాణంలో వున్న ఓ భవనంలో యువకుడి మృతదేహాన్ని రక్తపుమడుగులో గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ హత్యోదంతం బయటపడింది. 

హైదరాబాద్: శుక్రవారం రాత్రి ఇంట్లోంచి బయటకు వెళ్లిన యువకుడు అత్యంత కిరాతకంగా హతమార్చబడ్డాడు. నిర్మాణంలో వున్న ఓ భవనంలో యువకుడి మృతదేహాన్ని రక్తపుమడుగులో గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ హత్యోదంతం బయటపడింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ లోని బహదూర్ పురా ప్రాంతానికి చెందిన జూబేర్ అలీ పండ్ల వ్యాపారం చేసేవాడు. సోదరుడు మునాఫర్ తో కలిసి మెహిదీపట్నంలో వ్యాపారం చేసేవాడు. అయితే చెడు అలవాట్లకు అలవాటుపడ్డ జుబేర్ వ్యాపారాన్ని వదిలేసి జులాయిగా తిరిగేవాడు. 

read more కిరాతకం... ప్రాణాలతోనే పాడి పశువుల తొడలు కోసి

ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి స్నేహితుల వద్దకు వెళుతున్నానని చెప్పి ఇంట్లోంచి బయటకు వెళ్లాడు. అయితే తెల్లవారినా అతడు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు స్నేహితులను ఆరా తీశారు. ఈ క్రమంలోనే జుబేర్ స్నేహితుడు మునాఫర్ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి నిర్మాణంలో వున్న ఓ భవనంలో అతడి మృతదేహం పడివున్నట్లు తెలిపాడు. దీంతో అక్కడికి చేరుకున్న కుటుంబసభ్యులు రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్న జూబేర్‌ను చూసి బోరుమన్నాడు. 

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే తన తమ్ముడికి సలాం, తహరీఖ్, ముజఫర్, జాఫర్ అనే యువకులతో గొడవ జరిగిందని... ఈ దారుణానికి వారే పాల్పడి వుంటారని అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో పాత గొడవల కారణంగా స్నేహితులే ఈ హత్య జరిగివుంటుదన్న కోణంలోనే పోలీసుల దర్యాప్తు సాగుతోంది.