Asianet News TeluguAsianet News Telugu

ఉన్నతోద్యోగి: వైద్యం కోసం పైసాలేదు, విరాళాలు సేకరిస్తున్న స్నేహితులు

 ప్రమాదకరమైన వ్యాధికి చికిత్స చేసుకొనేందుకు చేతిలో చిల్లిగవ్వలేకపోవడంతో స్నేహితులు ఆదుకొంటున్నారు. ఆయన వైద్యం కోసం మిత్రులు చందాలను పోగేస్తున్నారు. అడిషనల్  కలెక్టర్ ర్యాంకులో ఉన్నప్పటికీ వైద్యం కోసం ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితులు ఆయనకు ఏర్పడ్డాయి.

Friends tries for financial assistance to jayashankar bhupalpally  additional collector Ganesh treatment lns
Author
Hyderabad, First Published Oct 16, 2020, 2:07 PM IST


హైదరాబాద్: ప్రమాదకరమైన వ్యాధికి చికిత్స చేసుకొనేందుకు చేతిలో చిల్లిగవ్వలేకపోవడంతో స్నేహితులు ఆదుకొంటున్నారు. ఆయన వైద్యం కోసం మిత్రులు చందాలను పోగేస్తున్నారు. అడిషనల్  కలెక్టర్ ర్యాంకులో ఉన్నప్పటికీ వైద్యం కోసం ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితులు ఆయనకు ఏర్పడ్డాయి.

సాధారణ ప్రభుత్వోద్యోగి ఈ కాలంలో కోట్లాది రూపాయాలను కూడగడుతున్నారు. కానీ అంచెలంచెలుగా అడిషనల్ కలెక్టర్ హోదాకు వైవీ గణేష్ చేరుకొన్నాడు.
భూపాలపల్లి జిల్లాలో గణేష్ అడిషనల్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నాడు. నిజాయితీ గల అధికారిగా ఆయనకు పేరుంది. 

ఇటీవల కాలంలో గణేష్ కు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దీంతో ఆయనకు హన్మకొండలోని ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అక్కడి నుండి హైద్రాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు.

జీతంపై ఆధారపడి మాత్రమే ఆయన జీవనం సాగిస్తాడు. దీంతో వైద్యం చేయించుకొనేందుకు చేతిలో చిల్లిగవ్వలేదు. ఈ విషయం తెలిసిన మిత్రులు, బ్యాచ్ మేట్స్, సబార్డినేట్స్ విరాళాలు సేకరిస్తున్నారు. 

ఇప్పటికే ఆయన వైద్యం కోసం రూ. 10 లక్షలను సేకరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మామిళ్లగూడెం గ్రామానికి చెందిన గణేష్ కు భార్య, ఇద్దరు కొడుకులు. కుటుంబం ఖమ్మంలోనే ఉంటుంది. ఉద్యోగరీత్యా ఆయన భూపాలపల్లిలో ఉంటున్నాడు. ఇటీవలనే ఆయన తల్లి మరణించింది. విధి నిర్వహణలో ఒత్తిడి కారణంగా ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని ఆయన స్నేహితులు చెబుతున్నారు.

1990-92 ఉస్మానియా యూనివర్శిటీ పీజీ బ్యాచ్, 1988-90 డిగ్రీ బ్యాచ్, 1995 ప్రొబేషనరీ డిప్యూటీ తహసీల్దార్ల బ్యాచ్ ,భూపాలపల్లి జిల్లా రెవిన్యూ అధికారుల బృందం గణేష్ కి వైద్య ఖర్చుల కోసం విరాళాలను సేకరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios