హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ కలకలం రేపుతోంది. పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా నమోదౌతున్నాయి.

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్న సమయంలోనే సెకండ్ వేవ్ కలకలం రేపుతోంది.ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో నలుగురు ఎస్ఐలు, నలుగురు కానిస్టేబుళ్లకు కరోనా  పాజిటివ్ సోకింది.

గత జూన్ మాసంలో కరోనా వచ్చినవారికే మరోసారి కరోనా సోకింది. దీంతో పోలీసులు ఆందోళన చెందుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విధులు నిర్వహించారు. ఈ విధులు నిర్వహించిన  పోలీసులకు కరోనా సోకడం కలవరపెడుతోంది.

తెలంగాణ రాష్ట్రంలో కేవలం 7778 యాక్టివ్ కేసులు ఉన్నాయి.రాష్ట్రంలో గత 24 గంటల్లో 517 కరోనా కేసులు నమోదయ్యాయి.  రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 33,098 కేసులు నమోదయ్యాయి.రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 1474కి చేరుకొంది.  రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.53శాతంగా ఉంది.

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నేతలు, కార్యకర్తలు క్వారంటైన్ లో ఉండాలని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు కోరిన విషయం తెలిసిందే. కరోనా విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని ఆయన కోరారు.