: అక్రమార్కులకు సహకరిస్తున్నారనే నెపంతో  సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ సీఐ నరసింహారెడ్డితో పాటు  మరో నలుగురు కానిస్టేబుళ్లను  ఐజీ స్టీఫెన్ రవీంద్ర సస్పెన్షన్ నిర్ణయం తీసుకొన్నారు.

హుజూర్‌నగర్‌: అక్రమార్కులకు సహకరిస్తున్నారనే నెపంతో సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ సీఐ నరసింహారెడ్డితో పాటు మరో నలుగురు కానిస్టేబుళ్లను ఐజీ స్టీఫెన్ రవీంద్ర సస్పెన్షన్ నిర్ణయం తీసుకొన్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ సీఐ నరసింహరెడ్డితో పాటు మరో నలుగురు కానిస్టేబుళ్లు అక్రమార్కులకు సహకరిస్తున్నారనే విషయమై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి.

రేషన్ బియ్యం అక్రమ రవాణకు, గుట్కా అక్రమంగా వినియోగించే వారికి పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపణలపై ఐజీ స్టీఫెన్ రవీంద్ర విచారణ నిర్వహించారు.ఈ విచారణ నివేదిక ఆధారంగా సీఐతో పాటు బలరాంరెడ్డి, కమలాకర్, వెంకటేశ్వర్లు అనే కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. 

అక్రమార్కులకు సహకరిస్తే చర్యలు తప్పవనే ఈ ఘటనతో పోలీసు ఉన్నతాధికారులు సంకేతాలు ఇచ్చారు.