పెద్దపల్లి జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

Four Person Killed in Peddapalli Road Accident
Highlights

రాజీవ్ రహదారిపై ఆగివున్న లారీని ఢీకొన్న కారు

పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజీవ్ రహదారిపై ఇవాళ  తెల్లవారుజామున ఓ ఆగివున్న లారీని వేగంగా వచ్చిన కారు భీ కొట్టింది. ఈ ప్రమాదం ఓ కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు.

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. చదువాల అరుణ కుమార్ వరంగల్ జిల్లా మంథనిలో కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ గా పనిచేస్తున్నాడు. ఇతడు తన భార్య సౌమ్య, పిల్లలు అకిలేష్, శాన్విలతో కలిసి కారులో హైదరాబాద్ నుండా స్వస్థలానికి వెళుతుండగా ఇలా ప్రమాదం జరిగింది.పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద రాజీవ్ రహదారిపై ఆగి వున్న లారీని వేగంగా వచ్చిన ఈ కారు ఢీ కొట్టింది. దీంతో ఈ కారు నుజ్జునుజ్జయిపోయి అందులో ప్రయాణిస్తున్న ఈ కుటుంబ సభ్యులందరూ మృతి చెందారు.

ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని ఈ ప్రమాదానికి గల కారణాల కోసం దర్యాప్తు చేస్తున్నారు.   

ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో ఆ  కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అంతేకాకుండా అరుణ్ కుమార్ మృతిపై మంథని కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌ స్కూల్ సిబ్బంది కూడా సంతాపం వ్యక్తం చేశారు.
   
 

loader