Asianet News TeluguAsianet News Telugu

ఒకే కుటుంబంలో నలుగురి అనుమానాస్పద మృతి

వంట గదిలో అజీరాం బీ, డైనింగ్ హాలులో ఆస్మా బేగం, ఇంటి వెనుక గుంత వద్ద అల్లుడు, హాలులో హసీనా మృతదేహాలు పడి ఉన్నాయి.  ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

FOUR members of family died in suspiciously
Author
Hyderabad, First Published Aug 14, 2020, 11:00 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఒకే కుటుంబంలో నలుగురు సభ్యులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ దారుణ సంఘటన వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఆజీరాం(63), ఆమె కుమార్తె ఆస్మా బేగం(35), అల్లుడు ఖాజా పాషా(42), మనుమరాలు హసీనా(10) మృతదేహాలు ఇంట్లో వేర్వేరు చోట్ల పడి ఉన్నాయి. గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

వంట గదిలో అజీరాం బీ, డైనింగ్ హాలులో ఆస్మా బేగం, ఇంటి వెనుక గుంత వద్ద అల్లుడు, హాలులో హసీనా మృతదేహాలు పడి ఉన్నాయి.  ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

క్షుద్రపూజలు జరిగినట్లు ఇంటి ఆవరణలో ఆనవాళ్లు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios