నిజామాబాద్ లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి అదృశ్యం కలకలం రేపింది. నగరంలోని గాయత్రి నగర్‌లో నివసిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యమయ్యారు. 

సందీప్, శ్రీకాంత్, ప్రియాంక, ఆర్య అనే నలుగురు వ్యక్తులు గత కొద్ది రోజులుగా కనిపించకుండా పోయారు. ఈ మేరకు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అప్పుల బాధ భరించలేక ఇంటి నుండి వెళ్లిపోయారనే అనుమానాలు  వ్యక్తం చేస్తున్నారు. 

వీరు నలుగురు గత ఐదు రోజులుగా కనబడటం లేదని వీరి తండ్రి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన నాలుగో టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.