తెలంగాణలోని మేడ్చల్ జిల్లా లో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని  కీసర మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు శుక్రవారం తెల్లవారుజామున ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 

భిక్షపతి, అక్షిత దంపతులకు ఇద్దరు పిల్లలు. కుటుంబకలహాలతో పిల్లలకు ఉరివేసి తామూ ఉరివేసుకున్నారు. ఈ ఘటన స్తానికంగా తీవ్ర కలకలం రేపింది. 

ఈ ఘటన నాగారం గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతుల్లో ఇద్దరు చిన్నారు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన మీద ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

నాకే కాదు హరీష్ రావుకు కూడ టీఆర్ఎస్‌లో అవమానాలు: ఈటల రాజేందర్...

కాగా, హైదరాబాద్ లో దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది. జీడిమెట్ల డివిజన్ ఎంఎన్ రెడ్డి నగర్ ఫేజ్-2 హనుమాన్ దేవాలయం సమీపంలో ప్రధాన రహదారిమీద ఓ శిశువు శరీర భాగం లభ్యమయ్యింది. దీంతో స్థానికంగా కలకలం రేగింది. వివరాలిలా ఉన్నాయి. 

సుమారు 5 నుంచి 7 నెలల ఉండే ఓ శిశువు ఛాతి సగభాగంతో కూడిన ఎడమచేయి రోడ్డు మీద పడి ఉండడాన్ని గురువారం ఉదయం స్థానికులు గుర్తించారు. వెంటనే పేట్ బషీరాబాద్ పోలీసులకు సమాచారం అందించడంతో వారు డాగ్ స్క్వాడ్ తో ఘటనా స్థలానికిి చేరుకుని దర్యాప్తు చేశారు. 

డాగ్ స్క్వాడ్ సంఘటనా స్థలానికి సమీపంలో ఉన్న ఖాళీ ప్రదేశాలు, ఓపెన్ నాలా, ఇతరత్రా ప్రాంతాల వైపు వెళ్లి వెనుతిరిగాయి. ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైన మృతి చెందిన శిశువును నిర్మానుష్య ప్రదేశాల్లో పేడయడంతో వీధి కుక్కలు అక్కడినుంచి లాక్కొచ్చి ఉంటాయని పోలీసులు అభిప్రాయ పడుతున్నారు.