కొత్తగూడెం: కొత్తూరు మాజీ ఎంపీటీసీ , టీఆర్ఎస్ నేత శ్రీనివాస రావును మావోయిస్టులు హత్య చేశారు. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా ఎర్రంపాడు వద్ద శ్రీనివాసరావు మృతదేహన్ని మావోలు వదిలివెళ్లారు.

ఈ నెల 8వతేదీన మాజీ ఎంపీటీసీ శ్రీనివాసరావును మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. కొత్తూరు ఎంపీటీసీగా శ్రీనివాసరావు గతంలో పనిచేశాడు.  శ్రీనివాసరావును  కిడ్నాప్ చేసిన తర్వా ఆయన ఆచూకీ కోసం గ్రామస్తులు పోలీసులు వెదికారు.

ఎర్రంపాడు-చెట్టిపాడు గ్రామాల మధ్య శ్రీనివాసరావు మృతదేహాన్ని మావోలు వదిలివెళ్లారు.పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నాడని  మావోలు  లేఖను వదిలివెళ్లారు. కిడ్నాప్ చేసే సమయంలో కుటుంబసభ్యులు బతిమిలాడారు. మావోలు వారికి తుపాకీ చూపి బెదిరించి  శ్రీనివాసరావును కిడ్నాప్ చేశారు.