అప్పుల కుప్ప చేశారు: కేసీఆర్‌పై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైర్

ఏ లక్ష్యం కోసం  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఆ లక్ష్యం దిశగా   కేసీఆర్  పాలన సాగడం లేదని  మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  చెూప్పారు.

Former  MP Ponguleti Srinivas Reeddy Fires on  KCR

ఖమ్మం: బంగారు తెలంగాణ అని  చెప్పి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని  సీఎం కేసీఆర్ పై  మాజీ ఎంపీ పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డి విమర్శలు గుప్పించారు.  మాజీ ఎంపీ  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  ఆదివారంనాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని  పాలేరులో  ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.  ఈ సమ్మేళనంలో  ఆయన  ప్రసంగించారు.  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్, బీజేపీలు కీలకంగా  వ్యవహరించాయన్నారు.  కానీ ఈ రెండు పార్టీలను కాదని  టీఆర్ఎస్ ను రెండు దఫాలు ప్రజలు రాష్ట్రంలో గెలిపించినట్టుగా  చెప్పారు. రాష్ట్ర ప్రజల ఆాకాంక్షలకు అనుగుణంగా  కేసీఆర్ పాలన చేస్తాడని భావించి  ప్రజలు  టీఆర్ఎస్ కు అధికారాన్ని కట్టబెట్టారన్నారు. కానీ కేసీఆర్ మాత్రం  ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా  పాలన సాగిస్తున్నాడని  పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డి విమర్శలు చేశారు. 

తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానని ప్రకటించిన కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాడని  ఆయన విమర్శించాడు.  రూ. 5 లక్షల కోట్లు కేసీఆర్ అప్పులు చేశాడని  పొంగులేటి చెప్పారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios