బీజేపీలో చేరిన మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్

భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బుధవారంనాడు బీజేపీలో చేరారు,. గత వారమే టీఆర్ఎస్ కి బూర నర్సయ్య గౌడ్  రాజీనామా  చేశారు.

Former  MP Boora Narsaiah Goud  Joins In  BJP

న్యూఢిల్లీ:భువనగిరి మాజీ  ఎంపీ  బూర నర్సయ్యగౌడ్  బుధవారంనాడు న్యూఢిల్లీలో బీజేపీలో చేరారు. పార్టీ అగ్రనేతల సమక్షంలో బూర నర్సయ్యగౌడ్ బీజేపీ సభ్యత్వం స్వీకరించారు.కేంద్ర మంత్రి బూపేంద్ర  యాదవ్ బూర నర్సయ్య గౌడ్  కు పార్టీ సభ్యత్వం అందించారు.తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ  తరుణ్ చుగ్,      కేంద్రమంత్రి కిషన్ రెడ్డి,బీజేపీ తెలంగాణ  రాష్ట్ర  అధ్యక్షుడుబండి సంజయ్  తదితరుల సమక్షంలో బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో  చేరారు.

మునుగోడు అసెంబ్లీ స్థానానికి  టీఆర్ఎస్ అభ్యర్ధిగా  కూసుకుంట్ల ప్రభాకర్  రెడ్డి  నామినేషన్ దాఖలు చేసిన  రోజునే  బూర నర్సయ్య గౌడ్  ఢిల్లీ  వెళ్లారు.బీజేపీ అగ్రనేతలతో భేటీ అయ్యారు.బీజేపీలో చేరేందుకు మంతనాలు జరిపారు .బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా సానుకూలంగా స్పందించింది.దీంతో ఈ నెల 15 వ తేదీన టీఆర్ఎస్ కు బూర  నర్సయ్య గౌడ్  రాజీనామా  చేశారు. రాజీనామా పత్రాన్ని కేసీఆర్ కు పంపారు. టీఆర్ఎస్ల్ లో  తాను కొంతకాలంగా అవమానాలకు గురౌతున్నట్టుగా రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

 రెండు  రోజుల క్రితం బీజేపీలో చేరుతున్నట్టుగా బూర నర్సయ్యగౌడ్  ప్రకటించారు. కాంగ్రెస్  పార్టీ  నేతలు కూడా బూర నర్సయ్య గౌడ్ ను సంప్రదించారు. అయితే బీజేపీలో చేరడానికి బూర నర్సయ్య గౌడ్  మొగ్గు చూపారు.మునుగోడు అసెంబ్లీ స్థానం నండి  టీఆర్ఎస్ టికెట్ ను  బూర నర్సయ్య గౌడ్ ఆశించారు. ఈ నియోజకవర్గంలో బీసీ ఓటర్లు అధికంగా ఉంటారు.గతంలో  బూర నర్సయ్యగౌడ్  ప్రాతినిథ్యం వహించిన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో  మునుగోడు అసెంబ్లీ  స్థానం ఉంటుంది.

దీంతో మునుగోడు ఉప ఎన్నికల్లో  పోటీ చేయాలని బూర నర్సయ్య గౌడ్ ఆసక్తిని చూపారు. కానీ  కేసీఆర్  మాత్రం మాజీ  ఎమ్మెల్యే  కూసుకుంట్ల ప్రభాకర్  రెడ్డికే కేసీఆర్ టికెట్  కేటాయించారు.  ప్రభాకర్ రెడ్డికి  భీ ఫాం అందించిన రోజునే  బూర నర్సయ్య  గౌడ్  ను,ఎమ్మెల్సీ ప్రభాకర్ ను కేసీఆర్ పిలిపించి  మాట్లాడారు.కేసీఆర్ తో సమావేశం ముగిసిన తర్వాత  కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని మంచి  మెజారిటీతో గెలిపిస్తామని  బూర నర్సయ్యగౌడ్ ,కర్నె ప్రభాకర్ లు చెప్పారు. 

మునుగోడు  అసెంబ్లీ  ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి తరపున  రేపటి నుండి బూర నర్సయ్య గౌడ్ ప్రచారం  నిర్వహించనున్నారు. ఈ  నెల 28న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో  బీసీ  ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించనున్నారు.

also read:బూర నర్సయ్య గౌడ్ ఇంటికి బండి సంజయ్: ఈ నెల 20 నుండి మునుగోడులో బూర ప్రచారం

మునుగోడు అసెంబ్లీ స్థానానికి వచ్చే నెల  3 వ తేదీన  పోలింగ్ జరగనుంది. కోమటిరెడ్డి  రాజగోపాల్  రెడ్డి  ఎమ్మెల్యే పదవికి  రాజీనామా  చేయడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఎమ్మెల్యే పదవికి   ఈఏడాది  ఆగస్టు 8న  ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్  రెడ్డి  రాజీనామా చేశారు..అంతకు  నాలుగు రోజుల ముందే కాంగ్రెస్ పార్టీకి  ఆయన  రాజీనామా చేశారు. ఈ ఏడాది ఆగస్టు 21న  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో  చేరారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios