కొందరు రెడ్డి సామాజికవర్గం నేతలు, డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు సహకరించలేదని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధి రాములునాయక్ తీవ్ర విమర్శలు చేశారు.
నల్గొండ: కొందరు రెడ్డి సామాజికవర్గం నేతలు, డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు సహకరించలేదని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధి రాములునాయక్ తీవ్ర విమర్శలు చేశారు.
నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా రాములునాయక్ బరిలోకి దిగారు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ఓట్లు దక్కలేదు. నల్గొండ కౌంటింగ్ సెంటర్ వద్ద ఓ తెలుగు న్యూస్ చానెల్ కు రాములునాయక్ ఇంటర్వ్యూ ఇచ్చారు.తనకు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డే సహకరించారని ఆయన చెప్పారు.
ఈ ఎన్నికల్లో క్యాష్, క్యాస్ట్ పనిచేసిందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏ ఎన్నికల్లో కూడ కోదండరామ్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కలేదన్నారు. కానీ ఈ ఎన్నికల్లో కోదండరామ్ కి ఇన్ని ఓట్లు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు.ఈ విషయమై గాంధీభవన్ లో పార్టీ నాయకులతో సమావేశం పెట్టి చర్చించనున్నట్టు చెప్పారు.
జనరల్ సీటులో తనను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపినా ఓట్లు రాకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
