విశాఖ బీచ్‌లో ప్రారంభించిన ఒక్కరోజులోనే తెగిపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జీ
విశాఖ ఆర్కే బీచ్‌లో ఫ్లోటింగ్ బ్రిడ్జీని ప్రారంభించిన మరుసటి రోజే అది తెగిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
visaka rk beach
వైసీపీ ప్రభుత్వం పర్యాటక రంగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని, సీఎం జగన్ విశాఖపట్నం అభివృద్ధి కోసం ఫోకస్ పెట్టారిన రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో ఫ్లోటింగ్ బ్రిడ్జీని ప్రారంభించే సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
visaka rk beach
గుడివాడ అమర్నాథ్, రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జీని ప్రారంభించారు. ఇందుకు సంబంధించి ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ బ్రిడ్జీకి సంంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
visaka rk beach
కాగా, ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జీ ప్రారంభించిన ఒక్క రోజులోనే తెగిపోయింది. ఘనంగా ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జీని ప్రారంభించిన ఒక్క రోజులోనే తెగిపోవడం రాజకీయంగా దుమారం రేపింది. తెగిన బ్రిడ్జీకి సంబంధించిన చిత్రాలు వైరల్ అవుతున్నాయి.