కోమటిరెడ్డి బిజెపికి వచ్చే చాన్స్ ఉంది

కోమటిరెడ్డి బిజెపికి వచ్చే చాన్స్ ఉంది

నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సంకినేని బిజెపిలో కొనసాగుతున్నారు. ఆయన అసెంబ్లీలో మీడియాతో చిట్ చాట్ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ నుంచి పోటీ చేయాలని ఎవరూ కోరుకోరని అన్నారు. ఆ పార్టీ పని తెలంగాణలో అయిపోయిందని స్పష్టం చేశారు. ఇప్పటికీ టిడిపిలో ఉన్నవారు పార్టీ మారాలనుకుంటే.. ఫస్ట్ ఆప్షన్ టిఆర్ఎస్ కాగా రెండో ఆప్షన్ కాంగ్రెస్ అని చెప్పారు. బిజెపి అనేది మూడో ఆప్షన్ మాత్రమే అవుతుందన్నారు. 2024లో అయినా బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందన్న భావన ఉన్నవారు బిజెపిలో చేరే అవకాశాలున్నాయని చెప్పారు.

ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ పార్టీకి కాళ్లు, చేతులు పోయాయని ఎద్దేవా చేశారు. గుజరాత్, హిమచల్ ప్రదేశ్ లలో ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోతే మైండ్ కూడా పోతుందన్నారు. అప్పడు కాంగ్రెస్ జీవచ్ఛవంగా మారుతుందన్నారు. అదే జరిగితే జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మినహ మిగతా కాంగ్రెస్ నేతలంతా బీజేపీ లో చేరడం ఖాయమన్నారు.

కోమటి రెడ్డి వెంకటరెడ్డి లాంటి నేతలు బీజేపీ లో చేరొచ్చని జోస్యం చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు చాలా మంది మాతో టచ్ లో ఉన్నారని చెప్పారు సంకినేని.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos