వడ్డేపల్లి:కర్నూల్ జిల్లా వెల్దూర్తిలో శనివారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో గద్వాల జిల్లాలోని రామాపూరం గ్రామానికి చెందిన 14 మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఈ గ్రామంలో మృతదేహాలతో మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఆదివారం నాడు ధర్నాకు  దిగారు.

ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే  సంపత్‌కుమార్  నేతృత్వంలో మృతదేహాలతో వడ్డేపల్లిలో కర్నూల్- రాయచూర్ రహదారిపై ఆదివారం నాడు ధర్నాకు దిగారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కర్నూల్ జిల్లా వెల్దుర్తి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో రామాపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ లక్ష్మన్న కొడుకు శ్రీనాథ్‌కు అనంతపురం జిల్లా గుంతకల్లులో పెళ్లి సంబంధం కుదిరింది. ఈ శుభ కార్యంలో పాల్గొని తిరిగి వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం జరిగి మృతి చెందారు. ఇదిలా ఉంటే కర్నూల్ ప్రభుత్వాసుపత్రి వద్ద బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. 

సంబంధిత వార్తలు

కర్నూల్ ప్రమాదం: ప్రభుత్వాసుపత్రి వద్ద బాధిత కుటుంబాల ధర్నా

జర్నీ సినిమానే: కర్నూల్‌ ప్రమాదంపై ప్రత్యక్షసాక్షులు

కర్నూలు రోడ్డు ప్రమాదం: కొద్దిసేపట్లో ఇంటికి చేరేవారే, మృతులు వీరే

కర్నూలు రోడ్డు ప్రమాదం: పెళ్లి చూపులకు వెళ్లి వస్తూ 15 మందిలో ఒక్కరే మిగిలారు

కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం (ఫోటోలు)

కర్నూలులో రోడ్డు ప్రమాద బీభత్సం (వీడియో)

కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం, 15 మంది మృతి