Asianet News TeluguAsianet News Telugu

ఎవరి లాభం కోసం చేస్తున్నారు: కాంగ్రెస్ సీనియర్లపై మల్ రెడ్డి రంగారెడ్డి ఫైర్

పార్టీని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి  రావడానికి  నేతలంతా  కలిసి  పనిచేయాల్సిన అవసరం ఉందని  మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి  చెప్పారు.పార్టీ సీనియర్లంతా  పార్టీని అధికారంలోకి వచ్చేందుకు  కలిసి కట్టుగా  పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

Former MLA Malreddy Ranga Reddy Serious Comments  On Senior congress leaders
Author
First Published Dec 18, 2022, 5:15 PM IST


హైదరాబాద్: తప్పు ఎవరూ చేసినా  తప్పేనని  మాజీ ఎమ్మెల్యే  మల్ రెడ్డి రంగారెడ్డి  చెప్పారు.పీసీసీ కమిటీల్లో  న్యాయం జరగకపోతే  పార్టీ అధిష్టానం ముందు  ఈ విషయమై చర్చించాలని  ఆయన  కోరారు.  కానీ  కమిటీల విషయమై  బహిరంగంగా  వ్యాఖ్యలు  చేస్తే  పార్టీకి తీవ్రంగా  నష్టపోయే అవకాశం ఉందని  మల్ రెడ్డి రంగారెడ్డి చెప్పారు.

ఆదివారంనాడు  గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.పీసీసీ కమిటీల్లో తప్పులు జరిగితే పార్టీ అధిష్టానంపై చర్చించాలన్నారు. ఎవరిపై కోపంతో పార్టీకి నష్టం  చేస్తున్నారో  చెప్పాలని మల్ రెడ్డి  రంగారెడ్డి  కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు  సూచించారు.పీసీసీ కమిటీల్లో  అన్యాయం జరిగితే  రేవంత్ రెడ్డితో పాటు మీరు అధిష్టానం ముందు  కూర్చుని చర్చించాలని  మల్ రెడ్డి రంగారెడ్డి సూచించారు.కాంగ్రెస్ పార్టీ సీనియర్ల మాటలతో క్షేత్ర స్థాయిలో  కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్రంగా బాధపడుతున్నారని  ఆయన అభిప్రాయపడ్డారు.

also read:రేవంత్ ను బలహీనపర్చే కుట్ర: కాంగ్రెస్ సీనియర్లపై అనిల్ ఫైర్

 పార్టీ ఏ ఒక్కరి సొత్తు కాదని మల్ రెడ్డి రంగారెడ్డి  చెప్పారు.  వచ్చే ఎన్నికల్లో పార్టీని  అధికారంలోకి వచ్చేందుకు  అందరం కలిసి  పనిచేయాల్సిన అవసరం ఉందని  ఆయన సూచించారు. కాంగ్రెస్ సీనియర్ల నేతల తీరుతో పార్టీకి  నష్టం జరుగుతుందన్నారు.  బీఆర్ఎస్, బీజేపీకి  లాభం చేకూర్చేలా  సీనియర్ల వ్యవహరం ఉందన్నారు.గత ఎన్నికల్లో  టికెట్ కేటాయింపులో  అవకతవకలు జరిగాయన్నారు.గెలిచే సీట్లను ఇతరులకు కేటాయించారని మల్ రెడ్డి రంగారెడ్డి  విమర్శించారు. తన నియోజకవర్గంలో  సగం  స్థానిక సంస్థలను కైవసం చేసుకున్నట్టుగా  ఆయన  చెప్పారు.కానీ సీనియర్లుగా చెప్పుకుంటున్న నేతలు తమ నియోజకవర్గాల్లో  ఎన్ని స్థానిక సంస్థలను గెలుచుకున్నారో చెప్పాలని మల్ రెడ్డి రంగారెడ్డి ప్రశ్నించారు. సీనియర్లు  బుద్ది మార్చుకోవాలని ఆయన కోరారు.

నిన్న  కాంగ్రెస్ సీనియర్లు సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క నివాసంలో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో టీసీసీ కమిటీల ఏర్పాటు విషయమై చర్చించారు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు కమిటీల్లో చోటు దక్కలేదన్నారు.  ఈ విషయమై అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్టుగా చెప్పారు. ఇవాళ జరిగే పీసీసీ కమిటీ సమావేశానికి దూరంగా  ఉండాలని  నిర్ణయం తీసుకున్నారు. నిన్నటి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టుగానే  ఇవాళ పార్టీ ఎగ్జిక్యూటివ్  సమావేశానికి  సీనియర్లు దూరంగా  ఉన్నారు. సీనియర్లను ఢిల్లీకి రావాలని పార్టీ అధిష్టానం సూచించింది. త్వరలోనే సీనియర్ నేతలు  ఢిల్లీకి వెళ్లనున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios