మాఫియా చేతిలో తెలంగాణ బందీ: కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరిన కేఎస్ రత్నం

బీఆర్ఎస్, కాంగ్రెస్ పై  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  ఇవాళ విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం  ఇవాళ బీజేపీలో చేరారు. 

Former MLA KS Ratnam Joins in BJP lns

హైదరాబాద్:తెలంగాణ ఓ మాఫియా చేతిలో బందీగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు నివురుగప్పిన నిప్పులా ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు. చేవేళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం  బీజేపీలో  చేరారు. బీఆర్ఎస్ కు కేఎస్ రత్నం నిన్ననే రాజీనామా చేశారు. శుక్రవారం నాడు హైద్రాబాద్ బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో  కేఎస్ రత్నం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.  కేఎస్ రత్నానికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగించారు. రాహుల్ గాంధీకి  రాజకీయ అవగాహన లేదన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని  రాహుల్ గాంధీ  చేసిన విమర్శలను  ఆయన తోసి పుచ్చారు.  ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను  చదవడమే  రాహుల్ గాంధీకి అలవాటని ఆయన  చెప్పారు.  తెలంగాణ సెంటిమెంట్ ఎమిటో, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఏమిటో , తెలంగాణ చరిత్ర ఏమిటో తెలియని రాజకీయ 
అజ్ఞాని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ కు బీ టీమ్ కాంగ్రెస్ పార్టీయేనని ఆయన కౌంటరిచ్చారు.

కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తమ పార్టీ పోరాటం చేస్తుందని  కిషన్ రెడ్డి గుర్తు చేశారు. కేసీఆర్ తొలుత  కాంగ్రెస్ పార్టీలో పనిచేశారని  కిషన్ రెడ్డి గుర్తు చేశారు.ఈ విషయం రాహుల్ గాంధీకి తెలుసా అని ఆయన ప్రశ్నించారు.  2004లో  కాంగ్రెస్ తో  పొత్తు పెట్టుకుని  కేసీఆర్  కేంద్రంలో మంత్రి పదవిని కూడ పొందారని  కిషన్ రెడ్డి గుర్తు చేశారు.ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని పోటీ చేసిన చరిత్ర బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఉందని  ఆయన గుర్తు చేశారు.  బీఆర్ఎస్, కాంగ్రెస్ లు కవల పిల్లలని ఆయన  విమర్శించారు.2014 లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.అమ్ముడుపోయే  పార్టీ కాంగ్రెస్ అని  విమర్శలు చేశారు. ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ కొనుగోలు చేసిందన్నారు. అమ్ముడుపోయే  పార్టీకి రాహుల్ గాంధీ, కొనుగోలు చేసే పార్టీకి కేసీఆర్ నాయకులని కిషన్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన వాళ్లు బీఆర్ఎస్ లో చేరి మంత్రులుగా కొనసాగుతున్నారని కిషన్ రెడ్డి చెప్పారు.  బీఆర్ఎస్ కు ఎవరు బీ టీమ్ ఇప్పుడు చెప్పాలని ఆయన రాహుల్ గాంధీని ప్రశ్నించారు.

బీఆర్ఎస్ , కాంగ్రెస్ కు ఏ టీమ్ ఎంఐఎం అన్నారు. ఈ రెండు పార్టీలను  అసదుద్దీన్ ఓవైసీ కంట్రోల్ చేస్తుంటారని  కిషన్ రెడ్డి  చెప్పారు. ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో  బీఆర్ఎస్ తో కాంగ్రెస్ చెట్టాపట్టాలేసుకుని తిరగలేదా అని  ఆయన ప్రశ్నించారు. మజ్లిస్ తో కలిసే బీఆర్ఎస్ తో తమ పార్టీ ఏనాడూ కలవదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ  అధికారంలోకి వస్తే  తాము కీలక పాత్ర పోషిస్తామని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను  ఆయన గుర్తు చేశారు. తాము తెలంగాణ ప్రజల టీమ్ అని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ లు అవినీతి పార్టీలన్నారు. ఈ రెండు పార్టీలు నియంతల అడుగు జాడల్లో నడిచే పార్టీలుగా ఆయన  విమర్శించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios