హైదరాబాద్:  మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. ఆయన బీజేపీలో చేరారు.  టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు అంజన్ కుమార్ అధ్యక్షుడికి విక్రమ్ గౌడ్ మధ్య విబేధాలు చోటు చేసుకొన్నాయి. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. 

శుక్రవారం నాడు  బీజేపీ నేత, మాజీ మంత్రి డికె అరుణ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్ సమక్షంలో విక్రమ్ కుమార్ గౌడ్ బీజేపీలో చేరారు.

గోషా మహాల్ నియోజకవర్గంలో  తాను సూచించినవారికి టికెట్లు కేటాయించాలని విక్రమ్ కుమార్ గౌడ్  చేసిన వినతిని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పట్టించుకోలేదని ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఈ అసంతృప్తితోనే ఆయన కాంగ్రెస్ కు ఇవాళ గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న బీజేపీ.. కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీల్లోని అసంతృప్తులను తమ వైపునకు తిప్పుకొనే ప్రయత్నం చేస్తోంది.