ఖమ్మం: మాజీ మంత్రి  జలగం ప్రసాదరావు టీఆర్ఎస్‌లో చేరే అవకాశాలు కన్పిస్తున్నాయి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గాను  ప్రసాదరావుపై  ఆ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది.ఇటీవలనే ఆయనపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తేసింది.  ఈ మేరకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డికి  కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం సమాచారాన్ని ఇచ్చింది.  అయితే  ఈ తరుణంలో  కాంగ్రెస్ పార్టీలో చేరకుండా కొందరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రసాదరావు భావిస్తున్నారు.  టీఆర్ఎస్‌లో జలగం ప్రసాదరావు చేరుతారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 

 ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన  మాజీ  మంత్రి జలగం ప్రసాదరావుపై 1999లో  కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటేసింది.  పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు  గాను  జలగం ప్రసాదరావు‌పై  ఆ పార్టీ సస్పెన్షన్  వేటేసింది. అయితే ప్రసాదరావుపై  విధించిన సస్పెన్షన్‌ను  ఆ పార్టీ ఎత్తేసింది. ఈ మేరకు  టీపీసీసీ చీఫ్  ఉత్తమ్‌‌కుమార్ రెడ్డికి  కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం  సమాచారాన్ని ఇచ్చింది.

కాంగ్రెస్ పార్టీలో పున: ప్రవేశం కోసం  జలగం ప్రసాదరావు  కొంత కాలంగా చేస్తున్న ప్రయత్నాలను అదే పార్టీకి చెందిన కొందరు నేతలు  అడ్డుకొంటున్నారని  ఆయన భావిస్తున్నారు.  ఈ నేపథ్యంలో గురువారం నాడు ఆయన  తన నివాసంలో  తన అనుచరులు, సన్నిహితులతో సమావేశమయ్యారు. 

జలగం ప్రసాదరావును టీఆర్ఎస్‌లో చేర్చుకొనేందుకు ఆ పార్టీ నేతలు కొందరు  మంతనాలు జరిపినట్టు ప్రచారం సాగుతోంది. ఈ విషయాన్ని ప్రసాదరావు మీడియాకు కూడ  చెప్పారు.  కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయాలని... టిక్కెట్టు ఇవ్వడం మాత్రం కష్టమేనని  కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి  తనకు ఫోన్ చేసి చెప్పారని ప్రసాదరావు  వెల్లడించారు.

జిల్లాలోని అన్ని నియోజకర్గాల్లో తన అనుచరులతో  సంప్రదింపులు జరిపిన మీదట  తాను ఓ నిర్ణయం తీసుకొంటానని ప్రసాదరావు చెబుతున్నారు.  కాంగ్రెస్ పార్టీ నుండి ఆశించిన ప్రయోజనం లేనందున  టీఆర్ఎస్‌లో చేరే అవకాశం ఉందని  ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రెండు మూడు రోజుల్లో  తన వైఖరిని స్పష్టం చేయనున్నట్టు  జలగం ప్రసాదరావు  స్పష్టం చేశారు.