సారాంశం

తెలంగాణ సీఎం కేసీఆర్ పై  మాజీ మంత్రి ఈటల రాజేందర్  విమర్శలు గుప్పించారు. భువనగిరిలో  నిర్వహించిన  కార్యక్రమంలో  రాజేందర్ ముఖ్య అతిథిగా  పాల్గొన్నారు

భువనగిరి:   తెలంగాణ నుండి  కేసీఆర్ ను తరిమికొట్టే  రోజు  త్వరలోనే వస్తుందని  బీజేపీ  నేత, మాజీ మంత్రి  ఈటల రాజేందర్ చెప్పారు. యాదాద్రి భువనగిరి  జిల్లా  భువనగిరిలో  ఆదివారంనాడు   జిట్లా బాలకృష్ణారెడ్డి  నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల అలయ్ బలయ్ కార్యక్రమంలో  ఈటల రాజేందర్  ముఖ్య అతిథిగా  పాల్గొన్నారు. 

రింగ్  రోడ్డు నిర్మాణం పేరుతో   కేసీఆర్  ప్రభుత్వం  రియల్ ఏస్టేట్ బ్రోకర్ అవతారం ఎత్తిందని ఆయన  విమర్శించారు. ప్రజల సొమ్ముతో  దశాబ్ది  ఉత్సవాలు  చేస్తున్నారన్నారు.  రైతు వేదికలు  ఎందుకు  పనికి రాకుండాపోయాయన్నారు. పండిన పంటను  అమ్ముకోలేని  దుస్థితి నెలకొందని  ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం  చేశారు. బీఆర్ఎస్ రైతులకు  ఏం మేలు  చేసిందో  చెప్పాలన్నారు.  పంచాయితీ  కార్యదర్శులు, ఆర్టీసీ  కార్మికులకు కేసీఆర్ అన్యాయం చేశారన్నారు. 

సకల జనులకు  తెలంగాణ  ఫలాలు అందాలనే  ఉద్దేశ్యంతో  తెలంగాణ  సాధించుకున్నారన్నారు.  కానీ .  రెండోసారి  కేసీఅధికారంలోకి  వచ్చిన తర్వాత   కేసీఆర్ అసలు  రూపం బయటపడిందని  ఈటల రాజేందర్  ఆరోపించారు. అభివృద్ధి ఆత్మగౌరవానికి ప్రత్యామ్నాయం కాదని ఉమ్మడి రాష్ట్రంలోనే చెప్పామన్నారు.

స్వేచ్ఛ, ప్రజాస్వామ్య పాలనను తెలంగాణ  ప్రజలు కోరుకుంటున్నారన్నారు.   కావాలి. ప్రజలను గౌరవించే, ప్రేమించే పాలన ఇవ్వాలని  ఆయన  కేసీఆర్ ను  డిమాండ్  చేశారు. తుఫాను వచ్చే ముందు సముద్రం ఎంత నిశ్చలంగా ఉంటుందో అంత నిశ్చలంగా తెలంగాణ గడ్డ ఉందన్నారు.  తుఫాను తాకిడికి కెసిఆర్ ప్రభుత్వం కొట్టుకుపోక తప్పదని   ఈటల  రాజేందర్  జోస్యం  చెప్పారు.