ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్‌ సిద్దమా?:కేసీఆర్, టీఆర్ఎస్‌లో దానం చేరిక

former minister Danam nagender joins in TRS
Highlights

దానం నాగేందర్ టిఆర్ఎస్ లో చేరిక


హైదరాబాద్:ముందస్తు ఎన్నికలకు తెలంగాణ సీఎం కేసీఆర్ సంకేతాలిచ్చారు. ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ నేతలు సిద్దమా అంటూ సవాల్ విసిరారు. ఏ సర్వే ఫలితాలు చూసినా టిఆర్ఎస్‌కు వంద సీట్లకు పైగా సీట్లలో అభ్యర్ధులు భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని తేలిందన్నారు. చిల్లర మల్లర రాజకీయాలు మాట్లాడే నేతలను ముందస్తు ఎన్నికలకు సిద్దమా అని అడగాలని తాను భావిస్తున్నానని కేసీఆర్ చెప్పారు. ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ నేతలు సిద్దమా అని నేను అడగాలని భావిస్తున్నానని కేసీఆర్ సవాల్ విసిరారు. 

 ఈ సర్వే ఫలితాలను త్వరలోనే  విడుదల చేయనున్నట్టు ఆయన ప్రకటించారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక చరిత్ర అని సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం చేయడం మరో చరిత్రగా ఆయన అభివర్ణించారు.అభివృద్ధి కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ నేతలు చిల్లర మల్లర రాజకీయాలను మానుకోవాలని కేసీఆర్ కోరారు. అభివృద్ధి కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు. చిల్లర రాజకీయ గోల వల్ల అభివృద్ధి ఆగకూడదన్నారు. అందుకే ఎన్నికలకు పోదామా అని కాంగ్రెస్ నేతలను అడగాాలని భావిస్తున్నట్టు కేసీఆర్ చెప్పారు.

మాజీ మంత్రి దానం నాగేందర్ ఆదివారం నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టిఆర్ఎస్‌లో చేరారు. శుక్రవారం నాడు దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.ఆదివారం నాడు తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  తన అనుచరులతో కలిసి దానం నాగేందర్ టిఆర్ఎస్‌లో చేరారు.

గ్రేటర్‌ హైద్రాబాద్‌లో టిఆర్ఎస్‌ను బలోపేతం చేసే లక్ష్యంగా కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా దానం నాగేందర్  కేసీఆర్ లో చేరారు. టిఆర్ఎస్ చీఫ్ కేసీఆర్  పార్టీ కండువా కప్పి దానం నాగేందర్‌ను టిఆర్ఎస్‌లోకి ఆహ్వానించింది. 

పట్టుదలతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చని తెలంగాణ రాష్ట్ర సాధనతో రుజువు చేసినట్టు కేసీఆర్ చెప్పారు. ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలను ప్రవేశపెట్టిన ఘనత తమ ప్రభుత్వానికి ఉందన్నారు. దేశంలోని పలు రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నాయని చెప్పారు.

టిఆర్ఎస్ పథకాలు రాజకీయం కోసం చేయడం లేదన్నారు. మిషన్ భగీరథ, ఈజ్ ఆఫ్ డూయింగ్, విద్యుత్ సరఫరాలో  తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమస్థానంలో ఉందని ఆయన గుర్తు చేశారు. 

షాదీముబారక్, కళ్యాణలక్ష్మి పథకాలు ఓట్ల కోసం తెచ్చినవి కావన్నారు. మానవనీయ కోణంలో తెలంగాణలో టిఆర్ఎస్‌ పాలన సాగిస్తున్న విషయాన్ని ఆయన చెప్పారు.
ఇప్పటికే నాలుగు దఫాలు సర్వేలు నిర్వహిస్తే  వందకు పైగా సీట్లను టిఆర్ఎస్‌ గెలుస్తోందని ఈ సర్వే ఫలితాలు వెల్లడించనున్నట్టు కేసీఆర్ చెప్పారు. రెండు మూడు రోజుల్లో ఈ సర్వే ఫలితాలను త్వరలోనే విడుదల చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. 

ప్రజల కోసం పనిచేసే వారిని ప్రజలను ఓడించరని  ఆయన గుర్తు చేశారు. పార్టీలకు అతీతంగా ప్రజలు వారిని గెలిపిస్తారని ఆయన చెప్పారు.ఒడిశా, మధ్యప్రదేశ్,ఛత్తీస్‌ఘడ్ లాంటి రాష్ట్రాల్లో ప్రజలు ఏ తరహాలో ఆయా పార్టీలను గెలిపించారో తెలంగాణలో కూడ ప్రజలు టిఆర్ఎస్‌ను గెలిపించనున్నారని కేసీఆర్ చెప్పారు.

తెలంగాణ రైతులు లక్షకోట్ల పంటను పండిస్తున్నారని ఆయన చెప్పారు. 2020 నాటికి తెలంగాణ ఆకుపచ్చగా కన్పించనుందని ఆయన చెప్పారు. దానం నాగేందర్ టీఆర్ఎస్‌లో  చేరింది సుఖ పడడానికి కాదు, పెద్ద బండ ఎత్తుకొన్నట్టు అని ఆయన చమత్కరించారు. ప్రజల కోసం నిత్యం పనిచేసే మనస్తతత్వం దానం నాగేందర్‌కు ఉందని ఆయన చెప్పారు. 

దానం నాగేందర్‌కు పార్టీలో మంచి స్థానం ఉంటుందని ఆయన చెప్పారు. చిన్నస్థాయి కార్యకర్త నుండి మంత్రి పదవులను నాగేందర్ నిర్వహించారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో  కలిసి పనిచేసేందుకు నాగేందర్ వస్తానని ప్రకటించగానే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

రానున్న రోజుల్లో  ఇంకా చాలా మంది నాయకులు టిఆర్ఎస్‌లో చేరనున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. బిజెపి నేతలు తనకు దమ్ముందా అని విమర్శిస్తున్నారని కేసీఆర్ గుర్తుచేశారు. బిజెపి దమ్ము ఎంతో  మనకు తెలుసునని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

మళ్ళీ టిఆర్ఎస్ విజయం సాధిస్తోందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. మాటలు చెప్పడం కాదన్నారు.చిత్తశుద్దితో పనిచేయాలని కేసీఆర్ చెప్పారు. ఏపీలో అభివృద్ధి జరగడం లేదన్నారు. అభివృద్ధి చేస్తున్నామని ప్రచారం చేసుకొన్నా అక్కడ అభివృద్ధి జరగలేదన్నారు. 

ప్రపంచంలో బెస్ట్ సిటీ అంటే హైద్రాబాద్‌ అనే పేరు రావాలి. ఈ మేరకు హైద్రాబాద్‌లోని నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు సిటీని అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని ఆయన కోరారు.

టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పనుల పట్ల ప్రజలు ఎంతో విశ్వాసంతో ఉన్నారని కేసీఆర్ చెప్పారు. వందకు పైగా సీట్లలో 50 శాతానికి పైగా ఓట్లు వస్తాయని ఈ సర్వే నివేదికలు వెల్లడిస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు. అయితే ప్రజల్లో ఎవరి బలమెంత ఉందనే విషయాన్ని తేల్చుకొనేందుకు సిద్దమా అని విపక్షాలను అడగాలని తాను భావిస్తున్నానని ఆయన చెప్పారు.
 

 

 

loader