Asianet News TeluguAsianet News Telugu

ఈ నెల 24న హస్తం గూటికి డీఎస్: సోనియా సమక్షంలో కాంగ్రెస్‌లోకి

ఈ నెల 24న మాజీ మంత్రి డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. సోనియాగాంధీ సమక్షంలో డీఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

Former minister D. Srinivas likely to join in Congress on January 24
Author
Hyderabad, First Published Jan 16, 2022, 3:14 PM IST


హైదరాబాద్: ఈ నెల 24న కాంగ్రెస్ పార్టీలో D. Srinivas చేరనున్నారు. Sonia Gandhi సమక్షంలో ఆయన Congress పార్టీలో చేరనున్నారు. ప్రస్తుతం డీఎస్ Trs ఎంపీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందే  డీఎస్ టీఆర్ఎస్  ద్వారా దక్కిన MP పదవికి కూడా రాజీనామా చేసే అవకాశం ఉంది.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో పీసీసీ చీఫ్ గా పనిచేసిన మాజీ మంత్రి డి.శ్రీనివాస్ (డీఎస్) కాంగ్రెస్‌లో చేరడానికి ముహుర్తం ఖరారు చేసుకొన్నారు. సోనియాగాంధీ సమక్షంలోనే పార్టీలో చేరాలని ఆయన నిర్ణయం తీసుకొన్నారు.ఈ నెల 24న సోనియా గాంధీ సమయం ఇవ్వడంతో అదే రోజు డీఎస్ కాంగ్రెస్ లో చేరనున్నారు. గత ఏడాది డిసెంబర్ 16న కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియాగాంధీతో డీఎస్ భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో  చేరాలని నిర్ణయం తీసుకొన్నారు. సోనియాగాంధీ కూడా డీఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అనుమతి ఇచ్చారు. గత ఏడాది డిసెంబర్ 17న ఈ విషయమై టీపీసీసీ చీఫ్ Revanth Reddy, సీఎల్పీ నేత MalluBhatti Vikramarka తో AIccపెద్దలు సమావేశం కావాల్సి ఉంది. అయితే కొన్ని కారణాలతో ఈ సమావేశం రద్దైంది. 

2014లో Telangana రాష్ట్రంలో టీఆర్ఎస్  అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ తనను అవమానాలకు గురి చేస్తోందని డీఎస్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. 2015 జూలై 8 వ తేదీన డీఎస్ కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరారు.  టీఆర్ఎస్ లో  చేరిన డీఎస్ కు తొలుత రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవిని కేసీఆర్ కట్టబెట్టారు. ఆ తర్వాత రాజ్యసభ పదవిని ఇచ్చారు. రాజ్యసభ దక్కడంతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవికి డీఎస్ రాజీనామా చేశారు.

2018 జూన్ 18న డీఎస్ కు వ్యతిరేకంగా అదే జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై సీఎం ను కలిసేందుకు డీఎస్ ప్రయత్నించారు. కానీ సీఎం కేసీఆర్ డీఎస్ కు అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. అప్పటి నుండి డి.శ్రీనివాస్ టీఆర్ఎస్ 
 టీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.  

అయితే పార్టీతో దూరం పెరిగిన సమయంలో  గతంలో ఒక్కసారి మాత్రమే పార్టీ ఎంపీల సమావేశానికి డీఎస్ హాజరయ్యారు. అంతేకాదు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో కూడా గత ఏడాదిలో డీఎస్ భేటీ అయ్యారు. డీఎస్ బీజేపీలో చేరుతారనే ప్రచారం కూడా సాగింది. డీఎస్ తనయుడు అర్వింద్ 2019 లో జరిగిన ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా విజయం సాధించారు. అర్వింద్ విజయం సాధించడం వెనుక డీఎస్ చక్రం తిప్పారనే ప్రచారం కూడ అప్పట్లో నెలకొంది.

ఈ  ఏడాది జూన్ వరకు డీఎస్ రాజ్యసభ పదవీకాలం ఉంది. అయితే డీఎస్ పార్టీకి దూరంగా ఉన్న నేపథ్యంలో అదే జిల్లా నుండి మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డికి టీఆర్ఎస్  రాజ్యసభ పదవిని కట్టబెట్టింది టీఆర్ఎస్.చాలా కాలంగా డీ.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరాలనే ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం కూడా లేకపోలేదు 2019 పార్లమెంట్ ఎన్నికలకు ముందు డీఎస్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలను కలిశారనే ప్రచారం సాగింది. డీఎస్ కు సన్నిహితులుగా ఉన్న కొందరు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. డీఎస్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం లాంఛనమేనని అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి.  అయితే డీఎస్ కాంగ్రెస్ లో చేరడం అప్పట్లో వాయిదా పడింది.

Follow Us:
Download App:
  • android
  • ios