మాజీ మంత్రి చంద్రశేఖర్ కాంగ్రెస్ లో చేరిక

మాజీ మంత్రి చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.  ఆ పార్టీ రాష్ట్ర ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే సమక్షంలో  చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Former Minister  Chandrashekar  joins in Congress lns

హైదరాబాద్: మాజీ మంత్రి  ఎ. చంద్రశేఖర్ బుధవారంనాడు  కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ  తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణిక్ రావు  ఠాక్రే సమక్షంలో  చంద్రశేఖర్  కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ నెల  13న  మాజీ మంత్రి చంద్రశేఖర్ బీజేపీకి రాజీనామా చేశారు. ఇవాళ కాంగ్రెస్ లో చేరారు.   ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  చంద్రశేఖర్  చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్, బీజేపీలలో  పనిచేశారు.  బీజేపీకి  ఈ నెలలోనే రాజీనామా చేశారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు.   కాంగ్రెస్ కండువా కప్పి  చంద్రశేఖర్ ను పార్టీలోకి ఆహ్వానించారు మాణిక్ రావు ఠాక్రే.

బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత చంద్రశేఖర్ ఇంటికి టీపీసీసీ  చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని  చంద్రశేఖర్ ను ఆహ్వానించారు.  వచ్చే ఎన్నికల్లో  చేవేళ్ల, జహీరాబాద్ అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒక స్థానం నుండి పోటీ చేసేందుకు కాంగ్రెస్ నాయకత్వం  చంద్రశేఖర్ కు ఆఫర్ ఇచ్చింది. అయితే  జహీరాబాద్ నుండి పోటీకి చంద్రశేఖర్ ఆసక్తిని చూపుతున్నారు.

ఈ సందర్భంగా చంద్రశేఖర్ ప్రసంగించారు.  బీఆర్ఎస్ ను ఓడించడం  కాంగ్రెస్ కే సాధ్యమన్నారు.వికారాబాద్ ప్రజలు తనను ఐదు దఫాలు గెలిపించిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.అయితే ఈ దఫా జహీరాబాద్ నుండి పోటీ చేయనున్నట్టుగా చంద్రశేఖర్ చెప్పారు. బీజేపీ సభకు  శాలువా తీసుకెళ్తే తాను దళితుడినని  అమిత్ షా శాలువా తీసుకోలేదన్నారు. 70 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడ సమాజంలో అసమానత్వం ఉందని ఆయన  ఆవేదన వ్యక్తం చేశారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios